ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా భూతం కోరలు చాస్తూ పంజా విసురుతోంది.. దీంతో రోజురోజుకు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగి పోతుంది. దీంతో రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా అటు ప్రభుత్వంలో కూడా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలను అమలు లోకి తెచ్చినప్పటికీ వైరస్ వ్యాప్తి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది. 

 

 

 ఇక రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. అయితే కొత్తగా నమోదైన కరోనా  పాజిటివ్ కేసులు ప్రకాశం,గుంటూరు,అనంతపురం,తూర్పు గోదావరి,కృష్ణ జిల్లాలో ఉన్నాయి. ఇక ఈ కేసులన్నీ ఢిల్లీలో నిర్వహించిన ప్రార్థన సభకు వెళ్లిన వ్యక్తులు ఉండటం గమనార్హం. ఢిల్లీలో నిర్వహించిన భారీ ప్రార్థన సభకు హాజరైన వ్యక్తులతో పాటు వారి కుటుంబీకులకు కూడా కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరికొంతమంది రిపోర్టు కూడా రావాల్సి ఉంది. లాక్ డౌన్ లాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 

 

 

 డాక్టర్ కె శ్రీనాథ్ రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్ గా నియమించింది జగన్ సర్కార్. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గతంలో ఢిల్లీలోని  ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గా  పని చేయగా ఆయనకు వైద్యుడిగా అపార అనుభవం ఉంది. అందుకే ఆయనకు పబ్లిక్ హెల్త్ అడ్వైజర్ గా నియమించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక అంచనాలు కూడా పూర్తవుతాయి. ఇదిలా ఉంటే...ఢిల్లీలో నిర్వహించిన భారీ ప్రార్థన సభ కోసం వెళ్లిన వారిలో రోజురోజుకు కరోనా  వైరస్ పాజిటివ్ ఉన్నట్లుగా నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరింత ఆందోళనకు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఢిల్లీలో నిర్వహించిన సభలో ఆరు రాష్ట్రాల ప్రజలతోపాటు విదేశాల నుంచి కూడా మత బోధకులు వచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: