ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య దాదాపు ఎనిమిది లక్షలు. అమెరికా దేశంలో ఈరోజు వరకు చైనాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య కంటే రెట్టింపు అనగా ఒక లక్ష అరవై వేల కేసులు నమోదు అయ్యాయి. ఇటలీ దేశంలో దాదాపు వయసు పైబడినవారు ఉండటం కారణం వారు కరోనా దెబ్బకి పిట్టల్లా రాలిపోతున్నారు. 30 ఏళ్ల వయసు దాటిన కొంతమంది తమకి అత్యాధునిక వైద్య సదుపాయాలు అవసరం లేదని... వయసులో ఉన్న కోసం వెంటిలేటర్స్ ఇంకా వైద్య పరికరాలను ఇవ్వమని చెప్పుతూ నవ్వుతూ చనిపోతున్నారు. అందుకే ఆ దేశంలో ఎక్కువ మరణాల సంఖ్య 11, 500కి చేరుకుంది. కేవలం ఇటలీ మాత్రమే కాదు యూరప్ దేశాలలో కరోనా వైరస్ కారణంగా వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. యూరప్ దేశాల వలనే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 37, 815 కోవిడ్ 19 మరణాలు సంభవించాయి.


ఇకపోతే అమెరికా దేశంలో ఇప్పటివరకు 3, 150 పైగా కరోనా మరణాలు సంభవించాయి. అమెరికాలో రెండు లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని ఓ తెలివైన ఉన్నత అధికారి చెప్పగా... అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ... ప్రజలందరినీ లాక్ డౌన్ పాటించేందుకు సిద్ధంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఆ దేశంలో సోమవారం ఒక్కరోజే 500 మందికి పైగా కోవిడ్ 19 వ్యాధికి బలయ్యారని నివేదికలు చెబుతున్నాయి.


అలాగే సోమవారం ఒక్కరోజే ఆ దేశంలో ఏకంగా 20 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కరోనా వ్యక్తిని అదుపులోకి తెచ్చేందుకు వైద్య అధికారులు, రాజకీయ నేతలకు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంత ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు ధైర్యం చేయడం లేదు. న్యూయార్క్ నగరంలో ఇప్పటివరకు పది లక్షల కరోనా టెస్టులు నిర్వహించగా... 70 వేల మందికి కోవిడ్ 19 పాజిటివ్ అని వచ్చింది. ఏది ఏమైనా కరోనా వైరస్ తీవ్రత అత్యధికంగా పెరిగిపోవడంతో... డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం విధించిన ఆంక్షలను ఏప్రిల్ 30 వరకు పొడగించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: