ఒక పక్క కరోనా రక్కసిని ఎలా అడ్డుకోవాలా అని భారతదేశం సతమతమవుతుంటే, మరో పక్క దేశంలో రోజుకో కొత్త కారణంతో కరోనా కేసులు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనల వల్ల భారతదేశంలో హైటెన్షన్ నెలకొంది. ప్రస్తుతం ఆ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఆంధ్రా, తెలంగాణ నుండి దాదాపు 800 మంది ఈ మత ప్రార్థనలకు హాజరయ్యారయ్యారు. ఇప్పుడు వారిని కనిపెట్టే పనిలో మన అధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గల నిర్మల్‌కు చెందిన 50 మంది ఢిల్లీ వెళ్లినట్టు తేలడంతో, అక్కడి అధికారులు హడలెత్తిపోతున్నారు.

 

 

నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కాజ్‌లో మత పరమైన ప్రార్థనలకు నిర్మల్ నుంచి 50 మంది వరకు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఆ ప్రార్థనలకు ఇండోనేషియా, తదితర దేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. ఇప్పటికే నిర్మల్‌లో కొందరినీ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని క్వారంటైన్‌కు కూడా తరలించారు. కొంత మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు స్వతంత్రంగా వచ్చి లొంగిపోవాలని, లేదా తాము వారిని గుర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే నిర్మల్ నుంచి 50 మంది వరకు ఢిల్లీకి వెళ్లడంతో, ప్రస్తుతం అక్కడ హై అలర్ట్ ప్రకటించారు.

 

 

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరణించిన ఆరుగురు కూడా ఢిల్లీ వెళ్లొచ్చిన వారే. ఆ ఆరుగురు కరోనా వైరస్ సోకడం వల్ల చనిపోయారని అధికారులు నిర్ధారించారు. ఏపీలో కూడా ఇలాంటి కేసులే నమోదవుతున్నాయి. ఇందువల్ల రెండు రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తెలంగాణ, ఏపీ నుంచి వెళ్లిన 800 మంది ఆరోగ్య పరిస్థితిపై అధికారులు దృష్టిసారించారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: