ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పెద్ద కల్లోలమే సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్  నగరంలో వెలుగులో వచ్చిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. కేవలం మానవాళి పైనే కాకుండా అన్ని రంగాలపై కూడా పడింది ఈ మహమ్మారి వైరస్ ప్రభావం. ఈ వైరస్ దెబ్బకు ఏకంగా ప్రపంచ దేశాల మధ్య ఉన్న అన్ని సంబంధాలు తెగిపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. ఇప్పటికే పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్నాయి.. ఆరోగ్య సంక్షోభం ఆర్థిక సంక్షోభం ఒక్కసారిగా వస్తే పరిస్థితి ఎంత దారుణంగా మారిపోతుంది అనేది ప్రస్తుతం ప్రపంచం మొత్తం కళ్లారా  చూస్తోంది. 

 

 

 ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఎన్నో కోట్ల సంపద ఆవిరైపోతుంది. అన్ని రంగాలపై ఈ మహమ్మారి వైరస్ ప్రభావం పడడం తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యం లోకి జారుకుంటుంది  అంటూ ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకమైన కరోనా  వైరస్ చేస్తున్న విలయతాండవానికి ... అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలో  కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఒకవేళ ప్రపంచ దేశాలు అన్ని ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడాలంటే... 2.5 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ అవసరం ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి తెలిపింది. 

 

 

 కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండి ఒత్తిడిని ఎక్కువ ఎదుర్కొంటున్న దేశాలు తమ తమ ఆర్థిక వ్యవస్థలకు రుణాలను  రద్దు చేయాలంటూ ఐక్యరాజ్యసమితి కోరింది. లేకపోతే గణనీయంగా అప్పులను తగ్గించాలంటూ కోరింది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఆరోగ్య సంక్షోభం రానున్న రోజుల్లో ఉంది అంటూ ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఒకవేళ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య సంక్షోభం వస్తే ఆయా దేశాలు మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకు పోతాయి అంటూ అంచనా వేసింది ఐక్యరాజ్యసమితి. అయితే సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం భారత్ చైనా దేశాల్లో  మాత్రం ఉండకపోవచ్చు అంటూ యుఎన్సిటిఏడి  పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: