ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరిన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు 200 దేశాలకు పాకింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7.60 లక్షలకు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 36,862 మంది మృతి చెందారు. కరోనా మరణాలు అత్యధికంగా నమోదవుతున్న ఇటలీలో 24 గంటల్లో మరో 812 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 537 మంది మృతి చెందారు. అమెరికాలో ఒక్క రోజులో దాదాపు 20,000 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆ దేశంలో 568 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

ప‌బ్లిక్ ఆఫ్ కాంగో మాజీ అధ్య‌క్షుడు జాక్వెస్ జాక్విన్ యోంబి ఒపాంగో.. కోవిడ్‌19 వ్యాధితో మృతిచెంచారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న పారిస్‌లో ప్రాణాలు విడిచిన‌ట్లు తెలుస్తోంది.  ఆయ‌న వ‌య‌సు 81 ఏళ్లు.  అయితే వైర‌స్ క‌న్నా ముందు ఆయ‌న ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. 

 

యోంబి ఒపాంగో 1977 నుంచి 79 వ‌ర‌కు కాంగ్రో-బ్రాజ‌విల్లీ ఉద్య‌మాన్ని న‌డిపించారు.  ఎన్నో సంవత్సరాల పాటు ఆయన జైల్లో గడిపాడు.  1993 నుంచి 1997 వ‌ర‌కు ఆయ‌న ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆ త‌ర్వాత ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు. 1997 నుంచి 2007 వ‌ర‌కు ప‌దేళ్ల పాటు దేశం విడిచి వెళ్లారు.   కాగ, ప్రాన్స్‌లోనూ ఒక్క రోజులో 418 మంది మృతి చెందగా, బ్రిటన్‌లో 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: