ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ భార‌త్లో కోర‌లు చాస్తూ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 8 ల‌క్ష‌లు దాటేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నానికే 38, 721 మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. ఇక మ‌న‌దేశంలో 1251 పాజిటివ్ కేసులు ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయ్యాయి. తాజాగా మంగ‌ళ‌వారం కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలో క‌రోనా ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న అంశంపై వివ‌రాలు వెల్ల‌డించింది. గ‌త 24 గంట‌ల్లో 227 కేసులు కొత్త‌గా న‌మోదు అయిన‌ట్టు స్ప‌ష్టం చేసింది.

 

దేశంలో క‌రోనా రోజు రోజుకు తీవ్ర‌త‌రం అవుతోన్న నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ సైతం తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. క‌రోనాపై పోరాటం చేసేందుకు ఇత‌ర దేశాల వైద్య సాయం కోరుతున్నాం అని చెప్పారు. అలాగే ఈ టైంలో ఎంతో క‌ష్ట‌ప‌డి వైద్యం అందిస్తోన్న వైద్యుల‌ను వేధిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసింది. మ‌రింత‌గా వైద్య సేవ‌లు అందేందుకు 15 వేల మంది న‌ర్సుల‌కు ఆన్‌లైన్ శిక్ష‌ణ ఇస్తున్న‌ట్టు తెలిపారు. అలాగే క‌రోనా ప‌రీక్ష‌లు స్పీడ్‌గా చేసేందుకు ప్రైవేట్ ల్యాబ్స్‌తో సంప్ర‌దింపులు చేస్తున్నాం అని తెలిపారు.

 

ఏదేమైనా మ‌న‌దేశంలో రెండు రోజుల క్రితం వ‌ర‌కు ప‌రిస్థితులు కంట్రోల్లో ఉన్నాయ‌నుకుంటే ఇప్పుడు ఇక్క‌డ కూడా క‌రోనాకు బ్రేకులు వేయ‌డం క‌ష్టంగా మారింది. అదే స‌మ‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా రెచ్చిపోయింది. ఏపీలో ఈ ఒక్క రోజే 17 కేసులు న‌మోదు కాగా.. తెలంగాణ‌లో టోట‌ల్ కౌంట్ 76, ఏపీలో 40కు చేరుకుంది.

 

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: