కరోనా వైరస్ స్కోర్ ని చూసుకోవాల్సిన పరిస్థితి ఇపుడు అందరికీ దాపురించింది. ఎంతో ఉల్లాసంగా క్రికెట్ స్కోర్ ఎంత అని అడగాల్సిన వారు కరోనా ఎక్కడ ఉంది. ఈ రోజు ఎందరు బలి అయ్యారు. ఇలాంటి లెక్కలను తీయాల్సివస్తోంది. ఇక ప్రపంచంలో కరోనా ఎక్కడా తగ్గడంలేదు. రావడం లేట్ కావచ్చు కానీ వచ్చాకా తనదైన మార్క్  అటాక్ చూపిస్తూనే ఉంది.

 

ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు భారత్ లో కూడా కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. మార్చి 2న కేవలం రెండు కేసులతో మొదలైన భారత్ కరోనా  చార్ట్ ఇపుడు 1251 కేసులకు పైగా నిండిపోయింది. ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ ఉన్నా కూడా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.

 

ఇక మరణాల రేటింగు విషయంలో భారత్ అపుడే అమెరికాను మించిందని అంటున్నారు. అమెరికాలో లక్షా అరవై వేల మందికి కరోనా పాజిటివ్ కేసులు ఉంటే అక్కడ మరణాలు కేవలం మూడు వేలు మాత్రమే ఉన్నాయి. అంటే చాలా తక్కువగా మరణాలు కనిపిస్తున్నాయ‌న్నమాట.

 

అదే సమయంలో భారత్ విషయం తీసుకుంటే 1251 కేసులు ఉంటే మరణాలు 32గా నమోదు అయ్యాయి. రేటింగ్ చూస్తే వందకు మూడు కేసులు మ్రుతి చెందినట్లుగా చూడాలంటున్నారు. అదే ఇపుడు అందరినీ కలవరపెడుతోంది. భారత్ లో ఇంకా కరోనా వైరస్ రెండవ దశలోనే ఉంది. ఇది కనుక అనూహ్య మలుపు తీసుకుని మూడవ, నాలుగవ దశలకు చేరుకుంటే మాత్రం మరణాల సంఖ్య ప్రపంచంలోనే ఎవరూ ఊహించని అతి పెద్ద నంబర్ గా నమోదు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

 

ఈ విషయంలో భారత్ మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అటు పాలకులు, ఇటు ప్రజలు కూడా సమిష్టిగా కరోనా వైరస్ పైన పోరాటం చేయాలి. ఎవరూ బయటకువ్ వెళ్ళకుండా ఇంట్లో ఉంటూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని అరికట్టగలమని అంటున్నారు. లేకపోతే ముప్పు తప్పదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: