కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్‌ డౌన్ వల్ల రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా పడిపోయిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర ఆదాయమూ అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాల్లో కోత వేయకతప్పదంటూ కేసీఆర్ ఓ సాహసానికి ఒడిగట్టారు. దేశంలో ఇలాంటి నిర్ణయం ప్రకటించిన మొదటి సీఎం కేసీఆర్. అయితే మరి ఈ నిర్ణయం వల్ల కేసీఆర్ ఎంత ఆదా చేయగలుగుతున్నారు.. ఓసారి చూద్దాం.

 

 

తెలంగాణలో మొత్తం నాలుగున్నర లక్షల మంది వరకూ ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వీరికి తోడు మరో 2.5 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు జీతభత్యాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,500 కోట్లు చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వారి జీతాల్లో కోత పెట్టింది. అయితే ఈ కోత అందరికీ ఒకేలా లేదు. వారి వారి స్థాయిలను బట్టి ఆ కోత ఉంది.

 

 

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ లాంటి అఖిల భారత సర్వీసుల అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధిస్తున్నారు. నాలుగో తరగతి మినహా మిగతా అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత వేశారు. ఇక నాలుగో తరగతి, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం వరకూ కోత పెట్టారు. అన్ని రకాల రిటైర్డు ఉద్యోగుల పింఛన్లలో 50 శాతం కోత వేశారు. నాలుగో తరగతి విశ్రాంత ఉద్యోగుల పింఛనులో 10 శాతం కోత విధించారు.

 

 

ఈ కోతల వల్ల ప్రభుత్వానికి రూ.1,700 కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా. అయితే ఇది మొత్తం ఉద్యోగుల వల్ల అయ్యే ఆదా మాత్రమే.. ఇవి కాకుండా ఇంకా.. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్‌ల ఛైర్‌పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో ఏకంగా 75 శాతం కోతేశారు. ఈ మొత్తంతో కేసీఆర్ సర్కారుకు నెలకు 2000 కోట్ల వరకూ ఆదా అవుతుందని లెక్కలు వేస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: