దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా లాక్ డౌన్ కొనసాగుతుంది.  ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌనక్ సీరియస్ గా కొనసాగుతుంది.  ఈ నేపథ్యంలో జనాలకు ఇంటి పట్టున ఉండాలని ప్రభుత్వాలు చెబుతుంటే.. కొంత మంది మాత్రం ఇవేవీ పట్టనట్టు తమ ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తూ.. నానా రచ్చ చేస్తున్నారు.  ప్రతిరోజూ సీఎం కేసీఆర్ మంత్రులు, నాయకులు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు లాక్ డౌన్ పై వివరాలను పర్యవేక్షిస్తున్నారు. 

 

తాజాగా  తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌ను అందరూ బాధ్యతగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే జైలుకి పంపుతామని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  తమిళనాడు నుంచి వలస వచ్చిన కార్మికులకు ఆయన నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు, శానిటైజర్లు, కొంత నగదును ఇచ్చారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే జైల్లో పెట్టిస్తామని హెచ్చరించారు.

 

లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రభుత్వం అన్ని సదుపాయాలూ అందిస్తోందని, నిత్యావసరాల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తాను చేతులెత్తి వేడుకుంటున్నానని వ్యాఖ్యానించారు. గ్రామాల్లోని పరిస్థితులను ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన ఆదేశించారు.  ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఆయన పర్యటించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: