ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో ఒకటే భయం... అదే ప్రాణాంతకమైన కరోనా  మహమ్మారి భయం. చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్... శరవేగంగా వ్యాప్తిచెందుతూ  ప్రపంచదేశాలను వణికిస్తోంది . సరైన రక్షణ కూడా లేకపోవడంతో యధేచ్చగా కోరలు  చాస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే ఎంతో మందిని బలితీసుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు పాకింది మహమ్మారి వైరస్. అయితే ఈ వైరస్ ను నియంత్రించేందుకు కొన్ని దేశాలు ఏకంగా స్వీయ నిర్బంధంలోకి  వెళ్ళిపోయాయి  కూడా. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను ప్రాణభయంతో వణికిస్తున్న ఈ మహమ్మారి వైరస్... ఇప్పుడు వరకు అంటార్కిటికా ఖండంలో మాత్రమే అడుగు పెట్టలేదు. అంటార్కిటికా ఖండంలో ఒక్క కరోనా  వైరస్ కేసు కూడా ఇప్పటివరకు గుర్తించబడలేదు.

 

 అంటార్కిటికా ఖండం లోని కొద్దిమంది ప్రజలు ఈ వైరస్ నుంచి తప్పించుకోగలిగారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి అంటార్కిటికా ఖండం పైనే ఉంది. అయితే అంటార్కిటికా ఖండంలో ఎక్కువ జనాభా లేకపోవడం వల్లే ఇదంతా సాధ్యమైనదని  తెలుస్తోంది. అయితే అంటార్కిటికాలో నివసించే 4400 మందులు మెజారిటీ ప్రజలు ఎక్కువగా పరిశోధకులు శాస్త్రవేత్తలు ఉండటం గమనార్హం.  సాధారణ సమయంలో కూడా అంటార్కిటికా నుంచి బయటకు రావడానికి లోపలికి వెళ్లడానికి కొంతమందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడికి ప్రవేశించేముందు వర్కర్లకు ఫ్లూ లాంటి సంకేతాలు ఉన్నాయి అనే తెలుసుకోవడానికి స్క్రీనింగ్  కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దాదాపు అంటార్కిటికా ఖండంలో వైరస్ సోకే అవకాశం లేదనే చెప్పాలి.

 

 

 కానీ పొరపాటున ఎవరైనా అంటార్కిటికా ఖండంలో ప్రపంచాన్ని ప్రాణభయంతో వనికిస్తున్న కరోనా  వైరస్ బారిన పడితే మాత్రం అది పెద్ద ప్రమాదం సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడి ప్రాంతం లో కరోనా  వైరస్ ను నివారించడం కాస్త కష్టతరమైన పని.జనాభా  కూడా తక్కువ సంఖ్యలో  ఉండడంతో నష్టం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దీని గురించి ఒక మెడికల్ ఆఫీసర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటార్కిటికా ఖండం తో పాటు ఏ ఖండం  కూడా ఈ వైరస్ నుంచి తప్పించుకునే  రోగనిరోధక శక్తిని కలిగి లేదు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: