ఇటీవల ఢిల్లీ వెళ్లి మత ప్రార్ధనలలో పాల్గొన్న వారి విషయంలో ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా ఆగ్రహంగా ఉంది. వాళ్ళ నుంచి ఇప్పుడు కరోనా వైరస్ రాష్ట్రాలకు ఎక్కువగా విస్తరిస్తుంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా వైరస్ సోకుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఈ ఒక్క రోజే 17 నమోదు కావడం తో అక్కడి ప్రభుత్వంలో అలజడి మొదలయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదోక రూపంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరించడం తో అందరిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది ఏ రూపంలో వస్తుందో కూడా ఎవరికి అర్ధం కావడం లేదు. 

 

కరోనా వైరస్  విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇప్పుడు దీని వలన ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి చర్యలు తీసుకున్నా సరే ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి కరోనా వైరస్ సోకుతుంది. తెలంగాణాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో వారి సంఖ్యా ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎక్కడా కూడా కరోనా వైరస్ పెరగకుండా ఉండటానికి సమర్ధవంతంగా చర్యలు చేపడుతున్నాయి. ఏ చిన్న తేడా వచ్చి గ్రామాలకు కరోనా వైరస్ వెళ్తే మాత్రం దాన్ని అదుపు చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. 

 

మన దేశంలో గ్రామాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. వారికి గనుక కరోనా సోకితే మాత్రం గ్రామాలకు గ్రామాలు కరోనా వైరస్ కారణంగా తుడిచి పెట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వారిపై క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా స్వచ్చందంగా బయటకు రాని వారిని అరెస్ట్ చేసి కేసు విచారణ లేకుండా జైల్లో కూడా పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తుంది అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: