జగన్ ఏపీ సీఎం. ఆయన అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారని కొందరి భావన. పదేళ్ళ కష్టానికి ప్రతిఫలం ఈ పదవి అని వైసీపీ నేతలు అంటారు. ఇక జగన్ విషయానికి వస్తే ఎవరు అవునన్నా కాదన్నా మరో నాలుగేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.

 

మరి అది గిట్టని వారికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అప్పట్లో ఏపీలోఇ  హుదూద్ తుఫాన్ వస్తే మొత్తం టాలెవుడ్ కదిలింది. అంతేనా మీడియా కూడా ముందుకు వచ్చి విరాళాలు వసూల్ చేసి మరీ  చంద్రబాబు చేతిలో పెట్టింది. మరి ఇపుడు జగన్ సీఎం దాంతో వారికి ఏపీ  ప్రజల గురించి పెద్దగా పట్టడంలేదనుకోవాలేమో

 

టాలీవుడ్ హీరోలైతే తమ వంతుగా సాయం చేశారు. నొప్పించక తానొవ్వక అన్న తీరున తెలంగాణాకు, ఏపీకి సమానంగా పంచారు. కొందరు తెలివైన హీరోలు ఈ డబ్బులు ఎవరికో ఇవ్వడం ఎందుకు అని తమ సినీ కార్మికులకు విరాళంగా పోగుచేస్తున్నారు. ప్రభాస్ లాంటి హీరోలు అయితే అటూ ఇటూ కూడా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. 

 

ఇలా తెలుగు  సినీ రాజకీయం ఇపుడిపుడే  రసకందాయంలో పడుతోంది. ఎందుకంటే సినిమా హీరోలు ఇదివరకులా కేవలం తెర మీదనే నటించడంలేదు. వారిలో కొందరు రాజకీయాల్లో ఉన్నారు. వారికి కూడా పెద్ద  కుర్చీ  మీద భారీ  ఆశలు ఉన్నాయి అందువల్ల తప్పనిసరిగా రాజకీయం ఉంటుంది. తమ తర భేదాలు పాటిస్తున్నారు.

 

ఇక మీడియా మోతుబరుల విషయానికి వస్తే బురద మాత్రం బాగా జల్లుతున్నారు. జగన్ ఏమీ చేయలేదన్న ఇంప్రెషన్ జనాల్లో పెంచడానికి నాన కష్టాలు పడుతున్నారు. అందులో వేయో వంతు తమను పోషిన ఆంధ్రా పాఠకులకు కష్టకాలంలో అండగా నిలవాలన్న ఆలోచన వారిలో లేకపోవడమే చిత్రం.

 

గతంలో తమ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు వేసి విరాళాలు సేకరించిన పెద్ద  మనుషులు ఇపుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారంటనే మీడియా  రాజకీయం ఎంతలా కంపు కొడుతోందో అర్ధమవుతోంది. ఇక గత అయిదేళ్ళ కాలంలో పేద రాష్ట్రం ఏపీ నుంచి భారీ ఎత్తున యాడ్స్ రూపంలోనూ, ఇతరరత్రా తెర చాటు ఒప్పందాల ద్వారా లబ్ది పొందిన వారంతా ఇపుడు కనీసం తమ వంతు సాయంగా కొంత మొత్తాన్నైనా కష్టకాలంలో ఏపీకి ఇచ్చి జనాన్ని ఆదుకోవాలన్న మనసు ఎందుకు పుట్టలేదో. 

 


ఏమో జగన్ కి మంచి పేరు వచ్చేస్తే ఎలా. తమకు రాష్ట్రం కంటే రాజకీయం ముఖ్యం కదా. అక్కడ బాబు లేనపుడు ఏపీ ఏమైపోతే మాకెందుకు అనుకున్నారో ఏమో  కానీ అలాగని నిమ్మళంగా ఉన్నారానుకుంటున్నారా. అసలు లేరు. పూర్తి నెగిటివ్ వార్తలతో పేజీలకు  పేజీలు నింపేస్తూ జగన్ని బదనాం చేసే పనిలో కొందరు మీడియా బాబులు తెగ బిజీగానే ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: