ప్రపంచం మొత్తం కరోనా వైరస్ భయంతో వణికి పోతుంది.  ఇండియాలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి నేటికి సరిగ్గా రెండు నెలలు. ఫిబ్రవరి 1న తొలి కేసు నమోదు కాగా, ప్రస్తుతం ఇండియా, 1000కిపైగా కేసులు నమోదైన 42 దేశాల సరసన చేరింది.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న విషయం తెలిసిందే.  అయితేకొంత మంది మాత్రం ఇప్పటికే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.  రాబోయే రెండు వారాలు మనకు అత్యంత కీలకం కానున్నాయి. కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుందన్న విషయం ఈ వారంలోనే తేలుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.   ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కజ్ మసీదు పేరు చెబితే భయంతో వణికి పోతున్నారు. 

 

ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. అక్కడ జరిగిన మతపరమైన ప్రార్థనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సుమారు 2 వేల మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. వారిలో చాలామందికి కరోనా సోకినట్టుగా అధికారులు అంచనాకు వచ్చారు.  ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తెలంగాణలో ఏకంగా ఆరుగురు కరోనాతో చనిపోవడం, ఆ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 

మార్చి 13వ తేదీ నుంచి 15 తేదీల మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.  ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 2వేల మంది ఈ ప్రార్థనల్లో పాల్గొనగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రార్థనలకు హాజరయినట్టుగా సమాచారం. ఏది ఏమైనా నిజాముద్దీన్ మర్కజ్ పేరు వింటే ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: