మహారాష్ట్రలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మహారాష్ట్రలో కరోనా కేసులు ఇప్పుడు 230గా ఉన్నాయి. ఇవి మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవి పెరిగితే మాత్రం రాష్ట్ర ఇబ్బంది పడటం ఖాయమని అక్కడి పాలకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ ని కట్ట్టడి చేసే విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా సరే అది మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి కనపడటం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారు ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. 

 

దీనితో ఇది ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి కేంద్ర సహాయ౦ తీసుకునే విధంగా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం వ్యూహాలు సిద్దం చేస్తుంది. కరోనా వైరస్ కట్టడి విషయంలో సరికొత్త మార్గం అనుసరించాలని, ముందు విదేశీయులు బయటకు వస్తే బహుమతి ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. పది వేల నుంచి లక్ష రూపాయల వరకు స్వచ్చందంగా బయటకు వచ్చే వారికి ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే ఆర్ధిక శాఖతో కూడా సంప్రదింపులు జరిపారు. 

 

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి సూచించారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా కట్టడికి ఇంత కు మించిన మార్గం లేదని, వారి ద్వారానే ఇప్పుడు వ్యాధి సోకుతుంది అని కేంద్రం భావిస్తుంది. వారి ద్వారానే వ్యాధి ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు తీవ్రంగా విస్తరించింది అనే అసహనం వ్యక్తమవుతుంది. గ్రామ స్థాయిలో ఇది విస్తరిస్తే మాత్రం ఇది ప్రమాదంగా మారుతుంది. కాబట్టి దీన్ని ఆదిలోనే కట్టడి చేస్తే ఏ ఇబ్బంది ఉండదు అని, ఇప్పటికే చేయి దాటే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: