సాధారణంగా చిన్నపిల్లలు తమ బొటన వేలుని నోట్లో పెట్టుకొని చీకుతూ ఉంటారు. ఈ చెడు అలవాటు సంవత్సరాల తరబడి పిల్లలకి అంటిపెట్టుకునే ఉంటుంది. ఈ అలవాటు కారణంగా బొటనవేలు పై ఉన్న దుమ్ము ధూళి నోట్లో కి వెళ్లడం తో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొంత వయస్సు వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటును మానకపోతే... చూసేవారికి కూడా ఈ చెడ్డ అలవాటు వెగటుగా కనిపిస్తుంది. అందుకే ఒక వేళ మీ పిల్లలకు ఈ అలవాటు ఉంటే అది మాన్పించేందుకు మీరు ఆర్టికల్ లో సూచించిన టిప్స్ ని పాటించండి.


1. పిల్లల దృష్టి ని మరల్చడానికి ఈ ప్రయత్నాలు చేయండి..


మీ పిల్లలకు బొటన వేలు చీకే అలవాటును మాన్పించాలి అనుకుంటే... వారికి తమ రెండు చేతులను ఉపయోగించే పనిని అప్పగించండి. ఉదాహరణకి పుస్తకాన్ని పట్టుకొని చదవడం, ఏదైనా రాతపని అప్పగించడం, ప్లే స్టేషన్ కొనిచ్చి వీడియో గేమ్స్ ఆడించడం, ఇంకా తదితర పనులు నిర్విరామంగా చేయించండి. నిపుణుల ప్రకారం ఇలా చేయించడం అనేది బొటనవేలును చీకే అలవాటును మాన్పించే పద్ధతిలో ఉత్తమమైనదని.


2. బొటనవేలు చుట్టూ ఏదైనా బ్యాండేజ్ చుట్టడం...


చాలా మంది పిల్లలు పడుకునే సమయంలో తమ చేతి బొటన వేలిని నోట్లో పెట్టుకుని పడుకుంటారు. ఐతే ఇలాంటి సందర్భాలలో వారి బొటనవేలికి మీరు ఏదైనా బ్యాండేజ్ కానీ తోలుబొమ్మలు కానీ తొడగండి. లేకపోతే మీ పిల్లల బొటనవేలు నిమ్మరసంలో ముంచి తీయండి. ఇలా చేస్తే మీ పిల్లలు ఆటోమేటిక్ గా బొటనవేలిని చీకే అలవాటును మానుకుంటారు.


3. తొందరపడకండి...


మీ పిల్లల బొటనవేలు చీకే అలవాటును మాన్పించేందుకు మీరు ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోకండి. చిన్న చిన్నగా మాన్పించేందుకు ప్రయత్నించండి. మొదటిగా ఉదయం సమయంలో మాత్రమే వారిలో ఈ వేలు చీకే అలవాటును మాన్పించండి. తర్వాత రాత్రి సమయంలో కూడా చేతి వేలు నోట్లో పెట్టుకునే అలవాటును మాన్పించాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: