ప్రపంచాన్ని మొత్తం చిగురుటాకులా వణికిస్తున్న మహమ్మారి కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో  వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. అయితే కంటికి కనిపించకుండా దాడి చేసే ఈ మహమ్మారి వైరస్ నుంచి  ప్రాణాలను హరించుకుపోతుంది అని ప్రజలు ప్రాణ భయంతో వణుకుతున్నారు. దీంతో ఏం చేయాలన్న వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కేవలం ఇతరులను ముట్టుకోవడం ద్వారానే కాదు కరెన్సీ మార్పిడి ద్వారా కూడా కరోనా  వైరస్ వస్తుందన్న  విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతం మనిషి  జీవితంలో ఒక భాగమైపోయిన స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా కరోనా  వైరస్ సోకే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. 

 

 

 అయితే ప్రస్తుత జనరేషన్ లో స్మార్ట్ ఫోన్ వాడకం నిజ జీవితంలో ఒక భాగం అయిపోయిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్లు ద్వారా కరోనా  వైరస్ వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఫోన్ వాడినప్పుడు... స్మార్ట్ఫోన్  చేతులు ముఖానికి తాకించుకోవడం ద్వారా వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే  2003లో వచ్చిన సార్స్  వైరస్ గ్లాస్ ఉపరితలం పై నాలుగు రోజులు ఉండగలదు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఇప్పుడు అంతకు మించిన ప్రమాదకరమైన కరోనా వైరస్ అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇదే తరహాలో అధ్యయనం చేసి సరికొత్త విషయాలను వెల్లడించింది. 

 

 

 ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికించి  ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్... ప్లాస్టిక్ తో పాటు స్టెయిన్లెస్ స్టీల్ ఉపరితలాలపై కూడా మూడు రోజుల పాటు సజీవంగానే ఉండగలదు అంటూ ఈ అధ్యయనంలో వెల్లడైంది. కార్డుబోర్డు ఉపరితలాలపై 24 గంటలు ఉంటుందని అధ్యయనంలో  వెల్లడైనట్టు పరిశోధకులు తెలిపారు. అయితే ప్రస్తుత కరోనా  వైరస్ గాజు ఉపరితలంపై ఎంత కాలం పాటు బతికి ఉండగలదు అనే విషయం తాజా అధ్యయనంలో స్పష్టత  రాకపోయినప్పటికీ... గత అధ్యయనాల ప్రకారం మాత్రం గాజు ఉపరితలంపై వైరస్ నాలుగు రోజుల పాటు జీవించగలదని  భావిస్తున్నారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: