కరోనా వైరస్ ప్రపంచంతో పాటు భారత దేశాన్ని కూడా వణికిస్తోంది. భారత్ నే కాదు అనేక అభివృద్ది చెందిన దేశాలను కూడా గడగడలాడిస్తోంది. అయితే ఇప్పుడు కరోనా కంటే మరో దారుణమైన వైరస్ ద్వారా ఇండియాకు ముప్పువాటిళ్లుతోంది. కరోనా వైరస్ చేస్తున్న హాని కళ్ల ముందు కదలాడుతుంటే.. ఈ వైరస్ చాపకింద నీరులా ఇండియాను నిర్వీర్యం చేస్తోంది.

 

 

కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ ద్వారా ఇంటి పట్టునే ఉన్న జనాలను ఈ వైరస్ తీవ్రంగా కబళిస్తోంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. కనీసం ఆ వైరస్ తమకు అంటుకుంటోందని.. దాని ప్రభావానికి తాము లోనవుతున్నామని ఎలాంటి అనుమానం కూడా ప్రజలకు రాకపోవడం అన్నమాట. ఇంతకీ ఆ వైరస్‌ ఏంటో తెలుసా.. అదే ఫేక్ న్యూస్.

 

 

అవును.. ఇప్పుడు భారత్‌లో అతి డేంజరస్ గా మారిన వైరస్ ఫేక్ న్యూస్. అసలే జనం ఇంటి పట్టున ఉన్నారు. ఏమీ తోచకుండా ఉన్నారు. ఈ సమయంలో వారికి కాస్త టైమ్ పాస్ కల్పిస్తోంది స్మార్ట్ ఫోనే.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ దాదాపు వాట్సప్, ఫేస్ బుక్ ఉండనే ఉంటాయి. ఇప్పుడు వాటిల్లో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు, పోస్టులు కరోనా వైరస్ కంటే చాలా డేంజరస్ గా ఉన్నాయి.

 

 

ఇదిగో.. కరోనాకు వైద్యం ఇదే అని ఒకడు పెడితే.. అబ్బే.. కరోనా తో జనం మొత్తం మటాష్ అంట అని ఇంకొకడు పెడతాడు. కేవలం టెక్స్ట్ పోస్టులేనా.. వీడియోలు, ఆడియోలతో జనాలను కొందరు భయపెడుతున్నారు. ఇటీవలే అపోలో ఆసుపత్రి వైద్యుడి పేరిట సర్క్యులేట్ అయిన ఓ ఆడియో జనాలను భయభ్రాంతులకు గురి చేసేసింది. చివరకు ఆ ఆసుపత్రి యాజమాన్యం ఆ వైద్యుడు తమ వద్ద పని చేయడం లేదని..అది ఫేక్ అని పోలీస్ కంప్లయింట్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ ను నమ్మకండి. కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సమాచారాన్నే నమ్మండి. ఫేక్ న్యూస్ అనే వైరస్ బారిన పడకండి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: