దేశంలో కరోనా పై లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కరోనా పరిస్థితుల పై మీడియా సమావేశం నిర్వహించారు.  ప్రస్తుతం దేశం మాత్రమే కాదు ప్రపంచంలో ఎన్నో దేశాలు కరోనాపై యుద్దం చేస్తున్నారని అన్నారు.  కరోనా వ్యాధి ప్రమాదకరమైనదని, కరోనా వ్యక్తి ఏదైనా వస్తువును తాకితే, ఆ వస్తువును ఇతరులు తాకితే వారికి కూడా కరోనా సోకుతుందని అన్నారు.  వైరస్ ఉన్న వారు ఏదైనా వస్తువు తాకితే అందరికీ కరోనా వస్తుందని స్పష్టం చేశారు.

 

అందుకే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని వివరించారు. దక్షిణ కొరియాలో కేవలం ఒక వ్యక్తి ద్వారా వేలమందికి వ్యాపించిన విషయం మరువరాదని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అనేక స్లైడ్లు వేసి మీడియాకు ప్రదర్శించారు. కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఒక స్థాయి దాటితే అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో వైద్యం అందించలేమని స్పష్టం చేశారు.  అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణంలో తేమ ఉండే దేశాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని తెలిపారు.

 

 

అయితే అలాంటి దేశాల్లోనూ కరోనా ఉనికి ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోనూ కరోనా తీవ్రంగానే ఉందని, ఒక్కరోజులో 17 కేసులు నమోదు కావడం అందుకు నిదర్శనమని చెప్పారు.  చైనాలోని వుహాన్ నగరంలో కరోనా కారణంగా 62 రోజుల పాటు లాక్ డౌన్ విధించారని, భారత్ లో 49 రోజుల లాక్ డౌన్ అవసరమని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనాను రూపుమాపాలని సూచించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: