ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. భౌతిక దూరాన్ని పాటిస్తే సరిపోతుందని తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ముక్కు, కళ్ళు, మోహము అస్సలు తాకవద్దని మరోసారి నొక్కి చెప్పింది కేంద్ర ఆరోగ్య శాఖ. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఐదు లక్షల రూపాయలను నరేంద్ర మోడీ ఫండ్ కి విరాళంగా ఇస్తున్నామని తెలిపింది. అలాగే నరేంద్ర మోడీ తల్లి గారు హిరాబా 25 వేల రూపాయలను పీఎం కేర్ ఫండ్స్ కి విరాళంగా ఇచ్చారు.


సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ... ఢిల్లీలో ఇంతవరకు ఎటువంటి లోకల్ ట్రాన్స్మిషన్ కరోనా కేసు నమోదు కాలేదని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న వేళలో నిజాముద్దీన్ మార్కాజ్ లో మతపరమైన ప్రార్థనలు నిర్వహించడం చాలా తప్పు అని, హాజరైన 1,548 మందిలో 441 మందిని ఆసుపత్రికి తరలించామని, మిగతా వారిని క్వారంటైన్ చేశామని కేజ్రీవాల్ తెలిపారు. అలాగే ఇటువంటి మతపరమైన ప్రార్థనలని మళ్ళీ ఎక్కడా కూడా నిర్వహించకూడదని, నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ... ఢిల్లీ మతపరమైన ప్రార్థనలలో ఆరుగురు హాజరయ్యారని అందులోని ఐదుగురిని ఐసోలేషన్ వార్డు లో ఉంచామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కూడా 369 మంది ఈ మతపరమైన ప్రార్థనలలో పాల్గొనటం వలన... ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 40 కి చేరుకుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 1030 ప్రజలు నిజాముద్దీన్ మతపరమైన ప్రార్థనల్లో పాల్గొని మార్చి 15 నుండి మార్చి 17 వరకు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నారు. అయితే తెలంగాణా కి తిరిగి వచ్చిన తర్వాత హాజరైన వారిలో ఈ రోజు ఆరుగురు చనిపోయారు.


ఇకపోతే జార్ఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా కరోనా కేసు నమోదయింది. కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన ఆ మొదటి వ్యక్తి... ఒక మలేషియా మహిళ అని వైద్య అధికారులు తెలిపారు. అస్సాం రాష్ట్రంలో కూడా మొట్టమొదటి కరోనా కేసు నమోదయింది. కేరళ రాష్ట్రంలో ఏడు కొత్త కేసులు నమోదు కాగా... ఒక కరోనా బాధితుడు మరణించాడు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 215కి చేరుకుంది.


ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య చూసుకుంటే...

ప్రపంచలో మొత్తం కేసులు: 803,126
మరణాలు: 39,032
రికవరీ కేసులు: 172,396

ఇండియాలో మొత్తం కేసులు: 1424
మరణాలు: 33 
కొత్త కేసులు: 114
రికవరీ కేసులు: 120 


తెలంగాణలో మొత్తం కేసులు: 78
మృతులు: 6 
కొత్త కేసులు: 1 
యాక్టివ్ కేసులు: 61 
డిశ్చార్జి కేసులు: 14
ఏపీలో మొత్తం కేసులు: 40
మృతులు: 1 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: