కరోనా వైరస్... కరోనా వైరస్... దీని వాళ్ళ ప్రస్తుతం ప్రపంచం ఎంత భయానక పరిస్థితులలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కారం ఒక వైరస్. ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే, ఏదైనా ఒక ఉపరితలం లేక ఏదైనా వస్తువును ముట్టుకున్నపుడు, అదే చేతులతో వారు తమ ముఖాన్ని తాకడంతో ఆ వైరస్ రావడానికి అసలు కారణం కాదని "సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్" ఈ విషయాన్నీ తెలిపింది.

 

 

ఇకపోతే CDC, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇంకా ఇతర ఆరోగ్య సంస్థలు అన్నీ కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి మన చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇంకా తరచూ తాకే ఉపరితలాలను క్రిమిరహితం చేసుకోవడం రెండూ అవసరమే అని గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి ఉపరితలాలు టచ్ చేయడం వల్ల ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయో మనకు కచ్చితంగా తెలీకపోయినా, చాలా వరకు జాగ్రత్తలు పాటిస్తే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.

 

 

ఇంకా ఆలాగే కరోనా వ్యాధికి అసలు కారణమైన సార్స్ - CoV-2 అనే ఈ వైరస్ కచ్చితంగా మనిషి శరీరం బయట ఎంత సమయం పాటు ఉంటుంది అనే ఒక విషయంపై మాత్రం ఇంకా వారికి స్పష్టత రావట్లేదు. అలాగే ఇప్పటి వరకు ఉన్న సార్స్, మెర్స్ సహా ఇతర కరోనా వైరస్‌ లపై జరిగిన కొన్ని అధ్యయనాల్లో పూర్తిగా క్రిములు అంతం చేయనంతవరకూ అవి లోహం, గ్లాస్, ప్లాస్టిక్ మీద ఆ వైరస్ 9 రోజుల వరకూ బతికి ఉంటాయని, వాటిలో కొన్ని బయట ఉన్న అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో ఏకంగా 28 రోజుల వరకూ ఇవి సజీవంగా ఉంటాయిని నిపుణులు  కనుగొన్నారు. అలాగే ఎక్కడైనా ఏ పరిస్థిని అయినా తట్టుకుని జీవించగలిగే సామర్థ్యం ఉన్న వైరస్‌ లలో కరోనా వైరస్‌ లు అతి ముఖ్యమైనవి.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple:  https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: