కలికాలంలో కరోనా కాలంలో జీవిస్తున్న మనుషులకు కరోనా పేరు వినబడితే చాలు బుర్ర గిర్రున తిరుగుతూ, భయంతో పరుగులు తీస్తున్నారు.. కరోనా అనే పేరు చదవడానికి మూడక్షరాలే కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.. అతి తక్కువ కాలంలో సెలబ్రిటీ హోదా సంపాదించింది.. కరోనా వస్తుందంటే ప్రతి వారు అడ్డుతప్పుకోవాలి.. లేదంటే అడ్డేలేకుండా చేస్తుంది.. అంతే కాకుండా కరోనా వల్ల ఇప్పుడు ప్రజలంతా బ్రతికి ఉండగానే నరకాన్ని అనుభవిస్తున్నారు.. కొందరైతే కరోనా దొరికితే మందులోకి మంచింగ్‌లా నంజుకుందామని చూస్తున్నారట..

 

 

కరోనా ముందు సినిమా డైలాగులు కూడా మరచిన జనం నిద్దర్లో కరోనా కరోనా అని కలువరిస్తున్నారట.. ఇకపోతే ఈ కరోనా దండయాత్రకు జనం పిట్టల్లా రాలిపోతున్న వేళ, నగరాలే శవాల దిబ్బల్లా మారుతున్న వేళ.. కరోనా అనే గ్రామం ఉందనే విషయం వెలుగులోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.. ప్రస్తుతం ఈ గ్రామం కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచానికి పరిచయం అవుతుంది..  వింటుంటే ఆశ్చర్యపోతున్నారా.. నిజమండి బాబు.. అయితే ఈ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలని ఆరాట పడుతున్నారా.. అయితే మీ కళ్లను అక్షరాల వెంట ముందుకు పంపండి..

 

 

ఇకపోతే ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఈ గ్రామం ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నుండి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న కుగ్రామంలా ఉంది. తాజాగా వారికి కూడా తెలియదు తమ గ్రామం పేరు రాక్షసిగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నదని.. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి పేరు తమ గ్రామానికి ఉండడంతో అక్కడి గ్రామస్తులు చింతిస్తున్నారు. ఇక 9000 జనాభా ఉన్న ఈ గ్రామం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లా మిశ్రీక్ తహశీల్ పరిధిలోకి వస్తుంది. కొన్ని దశాబ్ధాలుగా ఈ చిన్న కుగ్రామం ఇక్కడ ఉంది.

 

 

కానీ కరోనా వైరస్ వ్యాప్తితో ఈ గ్రామం ఎప్పుడూ లేని గుర్తింపును ఇప్పుడు పొందింది. అంతే కాకుండా ఇక్కడి గ్రామస్తులు తమ గ్రామం పేరు చెప్పి ఇతరులకు పరిచయం చేసేటప్పుడు భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.. చూసారుగా కరోనా అనే వైరస్ దెబ్బకు ఎక్కడో ఓ మూలనున్న గ్రామం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.. కాని ఇక్కడి ప్రజలు అవమానాలు పడుతున్నారట పాపం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: