చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచమంతా వణికిస్తోంది. చైనాలోనూ వేల మందిని పొట్టన పెట్టుకుంది. అధికారిక రికార్డుల ప్రకారం చైనాలో కరోనా కారణంగా మూడు వేల మూడు వందల మంది చనిపోయారు. ఇదీ చైనా వాడు చెబుతున్న లెక్క. అయితే చైనా మాటలు నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. చైనా చేసే ప్రతి పనిలోనూ వంచన ఉంటుందన్నది ప్రపంచ మెరిగిన సత్యం.

 

 

ప్రత్యేకించి కరోనా వైరస్ విషయంలో చైనా విశ్వసనీయత కోల్పోయింది. అయితే కరోనా కారణంగా చైనాలో ఎంత మంది చనిపోయి ఉంటారన్నది స్పష్టంగా వెల్లడి కావడం లేదు. కొన్ని మీడియా సంస్థలు ఈ సంఖ్య లక్ష దాటొచ్చని కూడా అంచనా వేస్తున్నాయి. అయితే చైనా వాడి అబద్దాలను నిరూపించే సాక్ష్యం మాత్రం ఎవరి వద్దా లేదు. అందుకే చైనా ఏం చెపితే అదే చెప్పడం మినహా ఏ మీడియాకూ వేరే అవకాశం లేదు.

 

 

అయితే ఇప్పుడు చైనా అబద్దాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఓ తిరుగులేని సాక్ష్యం లభించింది. అదేంటంటే... వుహాన్‌ శ్మశానాల్లో చితాభస్మం కుండల ఫోటోలు.. అవును ఇప్పుడు ఇవి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్చి 31 నాటికి చైనా చెబుతున్న మరణాల లెక్క 3,300. అయితే ఈ చితాభస్మం కుండల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే కనీసం 40వేల మంది మృత్యువాత పడి ఉంటారని. ఎలాగంటారా..

 

 

వుహాన్‌లో ఒక శ్మశాన వాటికలో 3500 కుండలున్న చిత్రం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది కేవలం ఒక్క శ్మశాన వాటిక చిత్రం మాత్రమే. ఇలాంటివి వుహాన్‌లో ఎనిమిది వరకూ ఉన్నాయి. వాటిలోనూ ఉన్న కుండలను అంచనా వేస్తే కనీసం 20 వేల నుంచి 40వేల మంది వరకూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. కానీ చైనా చెబుతున్నది కేవలం 3,300 మాత్రమే. అంటే ఈ ఒక్క స్మశాన వాటికలో ఉన్న కుండల కంటే తక్కువ. మరి చైనా వాడి అబద్దాన్ని ఈ ఒక్క ఫోటో బయటపెట్టడం లేదూ..

 

మరింత సమాచారం తెలుసుకోండి: