కరోనా వైరస్‌... దీని గురించి అనేక మంది అనేక విధాలుగా వివరాలు చెబుతుంటారు. నిజానికి చాలామంది వారికీ తెలిసింది కొంత చెప్పేది కొండంత. ఎవరికీ పూర్తి వివరాలు తెలియకుండానే కొంతమంది వైరస్ గురించి లెక్చరర్లు ఇస్తుంటారు. కాబట్టి ప్రతి విషయాన్నీ కాస్త అలోచించి ఏది నిజం ఏది అబద్దం అన్న విషయాన్నీ గ్రహించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. 

 

 

ఇక్కడ మీకు కరోనా గురించి కొన్ని తెలియని వాటిపై చూద్దాం. ఇందులో మొదటగా సార్స్ - CoV-2 వైరస్ వివిధ చోట్ల ఉపరితలాలపై ఎంత కాలం ఉండగలదు అనే విషయంపై అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్(NIH) లోని వైరాలజిస్ట్ నీల్టిజే వాన్ డోరెమాలెన్ వాటి మొదటగా కొన్ని పరీక్షలు చేశారు. ఈ పరిశోధనల గురించి "న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్‌" అనే పత్రికలో ప్రచురించారు. నిజానికి అందులో ఆ వైరాలజిస్ట్ ఏమని రాసాడంటే ఒక వ్యక్తి దగ్గితే వచ్చే తుంపర్ల రూపంలో ఈ వైరస్ సజీవంగా ఉంటుందని, అలాగే అందులోని పెద్ద తుంపర్లు 1 - 5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటాయని, అంటే ఇవి మనిషి వెంట్రుక కంటే దాదాపు 30 రెట్లు చిన్నగా ఉండే ఆ వైరస్ చాలా నిశ్చలంగా ఉన్న గాలిలో కొన్ని గంటలపాటు ఉంటుందని అయన చెప్పుకొచ్చారు.

 


ఇది ఇలాఉంటే వడపోత లేని AC ల నుండి వచ్చే వైరస్ కొన్ని గంటలు మాత్రమే ఉంటుందని అవి ముఖ్యంగా గాలి తుంపర్లలా వేగంగా చిమ్మే వైరస్ చెదిరిన గాలిలో ఉపరితలాలపై వేగంగా వ్యాప్తి చెంది అక్కడ ఉంది పేరుకపోతుందని తెలిపాడు. కానీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అధ్యయనంలో మాత్రం సార్స్ - CoV-2 వైరస్ కార్డుబోర్డు మీద ఏకంగా 24 గంటల పాటు బతుకుతుందని, అలాగే ఇతర ప్లాస్టిక్, స్టెయిన్‌ లెస్ స్టీల్ మీద వైరస్ ఏకంగా 2 - 3 రోజులపాటు బతికి ఉండగలదని చెబుతున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple:  https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: