కరోనా ఎఫెక్ట్ తో దేశమంతా లాక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. అన్నింటితో పాటు మద్యం షాపులూ బందైపోయాయి. కానీ మందుకు అలవాటు పడిన మందు బాబులు మాత్రం మద్యం లేకుండా ఉండలేకపోతున్నారు. ఎక్కడైనా బ్లాకులో దొరికితే ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ అవకాశం ఎక్కడా దొరకడం లేదు.

 

 

కొందరైతే మద్యం లేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరు ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు. మొన్న ఓ వ్యక్తి ఏకంగా మందు షాపు ముందే బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. ఇంకొందరు కల్లుకు బానిసైన వాళ్లు మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా పాసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నాయట కొన్ని ప్రభుత్వాలు. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు లెండి.

 

 

మద్యం లభించక వింతగా ప్రవర్తిస్తున్న వారి కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక పాస్‌లు జారీచేయాలని నిర్ణయించిందట. అయితే ఈ పాసులు అందరికీ ఇవ్వరు. దీనికి ఈ వ్యక్తి మందుకు బానిసయ్యాడు అని వైద్యుల నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాలట. అప్పుడే వారికి మందు సరఫరా చేస్తారట. ఇప్పుడు కేరళ సర్కారు నిర్ణయం పట్ల అక్కడి మందుబాబులు ఖుషీ అవుతున్నారట.

 

 

అసలు అవకాశం అంటూ రావాలే కానీ.. ఎన్ని సర్టిఫికెట్లయినా పుట్టిస్తాం.. చక్కగా చుక్కేసి ఎంజాయ్ చేస్తామని ఖుషీ అవుతున్నారట. మరి ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కానీ దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోలేం. కానీ ఏపీ, తెలంగాణలోనూ కొందరు సమయానికి మందు పడక పిచ్చోళ్లైపోతున్నారు. వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. మరి కేరళ సర్కారు తరహాలోనూ ఇక్కడ కూడా ఏమైనా పాసులు జారీ చేస్తారా.. చూడాలి ఏం జరుగుతుందో. అదే ఇక్కడ కూడా జరిగితే మందు బాబులుకు ఇక పండుగే పండుగ.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: