తాజాగా మహారాష్ట్రలో 72 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే అందులోని 59 మంది ముంబై నుంచి వచ్చిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియపరిచింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... తన ముఖ్యమంత్రి వేతనాన్ని, ఎమ్మెల్యే వేతనాన్ని, ఎంపీ పెన్షన్ ని తీసుకోనని చెప్పారు. అలాగే తాను స్వయంగా ఐదు లక్షల రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేషనల్ రిలీఫ్ ఫండ్ కి, అలాగే రాష్ట్ర ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చారు. తమిళనాడు సీఎం విజయ్ భాస్కర్ మాట్లాడుతూ కోవిడ్ 19 నిర్ధారణ కొరకై రెండు సరికొత్త పరిశోధన కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66కి చేరుకోగా... మొత్తం కేసుల లోని 44 ఇండోర్ లో నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 5 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో 13 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 101 చేరుకోగా... మరణాల సంఖ్య 3కి చేరుకోగా... 8 మంది కోవిడ్ 19 నుండి పూర్తిగా కోలుకున్నారు. రాజస్థాన్ లో తాజాగా 4 కొత్త కేసులు నమోదు కాగా... ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 93 కి చేరుకుంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కాజ్ లో ప్రార్థన కార్యక్రమానికి హాజరైన 36 మందిని గుర్తించామని భోపాల్ ప్రభుత్వం తెలియజేసింది.


ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య తెలుసుకుంటే...


ప్రపంచంలో మొత్తం కేసులు: 804,073
మరణాలు: 39,074
రికవరీ కేసులు: 172,435


ఇండియాలో మొత్తం కేసులు: 1513
మరణాలు: 33 
కొత్త కేసులు: 203
రికవరీ కేసులు: 120 


తెలంగాణలో మొత్తం కేసులు: 78
మృతులు: 6 
కొత్త కేసులు: 1 
యాక్టివ్ కేసులు: 61 
డిశ్చార్జి కేసులు: 14
ఏపీలో మొత్తం కేసులు: 40
మృతులు: 1 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: