కరోనా వైరస్ కట్టడి విషయంలో ప్రపంచ దేశాల కంటే భారత చాలా ముందు నుండి మొన్నటి వరకు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వచ్చాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా మరియు ఇటలీ అదేవిధంగా స్పెయిన్ లాంటి దేశాలు వైరస్ ని ఎదుర్కొనలేక పోతున్నాయని ఇండియా ఈ విషయంలో అద్భుతంగా యుద్ధం చేస్తుందని అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు. చైనా దేశంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలు అన్న వాటి తాట తీసేస్తుంది. ప్రస్తుతం అలాంటి దేశాలలో సంభవిస్తున్న మరణాలు అదేవిధంగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసులు చూస్తుంటే మిగతా దేశాలలో వణుకు మొదలవుతున్నాయి.

 

అయితే ఉన్న కొద్ది లెక్కలు మారిపోతున్నాయి. మొన్నటివరకు అమెరికాలో మరణాల రేటు ఎక్కువగా ఉంటే ఇటీవల భారత్ లోనే మరణాల రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల బట్టి నమోదవుతున్న లెక్కల ప్రకారం ఈ వైరస్ సోకిన వారిలో అమెరికాలో ఈ మరణాల రేటు 1.74 గా ఉండగా, భారత్ లో 2.70 గా ఉంది. ఇది ప్రపంచ సగటు రేటు 4.69 కంటే తక్కువే అయినప్పటికీ చాలా దేశాలలో పోలిస్తే ఇది ఎక్కువేనట. ఇక జర్మనీ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువుగా ఉన్న మరణాల రేటు 0.8 శాతానికి పరిమితమైంది.

 

ఇప్పటివరకు భారత్ లో 35 వేల మందికి పరీక్షలు జరపగా అందులో 1024 మందికి పాజిటివ్ గా తేలింది. అంటే అనుమానిత కేసుల్లో 2.92 శాతం మందిలో ఈ వైరస్ ఉంది. అయితే నిపుణులు చెబుతున్న ఏమిటంటే చాలావరకు సోషల్ డిస్టెన్స్, సెల్ఫ్ Quarantine పాటిస్తే ఖచ్చితంగా వైరస్ ని ఎదుర్కోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలు ప్రభుత్వాలకు సహకరించకపోవడంతో ఈ వైరస్ అంతగా వ్యాపించిందని...కానీ భారత్ లో ప్రజలంతా ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను పాటించడంతో అటువంటి సమస్య తలెత్తదు...లాక్ డౌన్ కరెక్ట్ గా పాటిస్తే అని అంటున్నారు. ఇండియాలో కరోనా కంట్రోల్ లో ఉంది అనుకుంటున్న ఈ తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో బాంబు లాంటి ఈ న్యూస్ రావడంతో  దేశంలో భయాందోళన నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: