ఓ వైపు కరోనాని అరికట్టేందుకు ప్రభుత్వాలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  లాక్ డౌౌన్ చేశారు.. ప్రతి ఒక్కరినీ ఇంటి పట్టున ఉండమని చెబుతున్నారు.  మార్చి 13వ తేదీ నుంచి 15 తేదీల మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.   ఈ ప్రార్థనలకు ఇతర దేశాల నుంచి మత పెద్దలు సైతం వచ్చినట్టుగా అధికారుల విచారణలో తెలిసింది. ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 2వేల మంది ఈ ప్రార్థనల్లో పాల్గొనగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రార్థనలకు హాజరయినట్టుగా సమాచారం.

 

ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో తెలంగాణలో ఇప్పటికే ఆరుగురు మృతిచెందారు. తాజాగా ఢిల్లీ వెళ్లొచ్చినవారితో కలిసినవాళ్లు వైద్య పరీక్షలకు ముందుకురావాలని సీఎం జగన్ కోరారు. అర్భన్ ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలపై కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేసిన ఇంటింటీ సర్వేపై ఆరాతీశారు.  ఢిల్లీ నుంచి వచ్చిన వారు వెంటనే సరెండ్ అయి ట్రీట్ మెంట్ తీసుకోవాలని హెచ్చరించారు. 

 

కరోనా ఒకరి నుంచి ఒకరి వ్యాప్తి చెందుతున్న సమయంలో సామాజిక బాధ్యత కలిగిన వారు తోటి వారి గురించి ఆలోచించాలని అన్నారు.  ఈ నేపథ్యంలో ఢిల్లీ సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన వారి వివరాలు తెలిపేందుకు స్థానికంగా మరిన్ని ప్రార్థనా మందిరాల్లో చిన్నపాటి సమావేశాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది.  ఇప్పుడు భద్రత పాటించకుండా కరోనా మరింత ప్రమాదం అవుతుందని అన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: