కరోనా వైరస్ అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ అమలులోకి తీసుకు రావడం జరిగింది. వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రవాణా సంస్థ తో పాటు అన్నీ కూడా స్తంభించిపోయాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి నేపథ్యంలో చాలామంది ఈ emi విషయాలలో కేంద్ర ప్రభుత్వాలకు తమ బాధను తెలియజేయడంతో ఇటీవల బ్యాంకుల తో మాట్లాడి కేంద్రం పరిధిలో ఉండే ఆర్బిఐ emi విషయాలలో మూడు నెలలపాటు సవరణలు తీసుకురావటం జరిగింది. అయితే ఇప్పుడు అదే విధంగా దేశంలో లాక్ డౌన్ అమలులోకి ఉండటంతో ప్రజలు రీఛార్జి చేసుకునే వీళ్లు లేకపోవటంతో పాటు అనేక ఇబ్బందులు ప్రస్తుతం పడుతున్నారు. ఈ క్రమంలోనే తమ కస్టమర్లకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది.

 

ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలులో ఉండటంతో ఏప్రిల్ 17 వరకు 100 నిమిషాల టాక్‌టైం, 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా రీఛార్జి చేయకపోయినా గాని లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇన్ కమింగ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో లాక్ డౌన్ నుంచి టెలికాం సంస్థలకు మినహాయింపు ఇచ్చిన చాలా చోట్ల షాపులో తెరవలేదు అని చాలామంది కస్టమర్లు ఆన్లైన్ ద్వారా రీఛార్జి చేసుకోలేరు కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న ప్లాన్స్ గడువును పెంచాలని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లను కోరింది.

 

దీంతో ట్రాయ్ సూచన మేరకు ఎయిర్టెల్ సంస్థ కూడా కాలపరిమితిని ఏప్రిల్ 17 వరకు ఓడించడమే కాకుండా పది రూపాయల టాక్ టైమ్ కూడా జత చేయడం జరిగింది. వోడాఫోన్ మరియు ఐడియా కూడా ఇదే ఆఫర్ను ప్రకటించి కేవలం పేదలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎక్కువగా జియో కస్టమర్ లో ఉండటంతో జియో సంస్థ తీసుకున్న నిర్ణయానికి సంతోషంగా ఫీల్ అవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: