కరోనా వైరస్.. మన భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 39వేలమంది మృతి  చెందారు. 8లక్షలమందికిపైగా ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఈ కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే భారత్ లో 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకు పరిమితం అయ్యారు. కానీ కరోనా వైరస్ మాత్రం అత్యంత వేగంగా చాప కింద నీరులా వ్యాపిస్తుంది. అయితే భారత్ లో ఇప్పటికే మధ్యప్రదేశ్, కేరళలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆధిక్యంలోకి వచ్చేలా ఉంది. 

 

IHG

 

కేవలం ఈ ఒక్క ఈరోజే ఆంధ్రాలో 21 మందికి కోవిడ్ సోకింది. నిన్నటి వరుకు 23గా ఉన్న కరోనా వైరస్ కేసులు ఈరోజు ఏకంగా 44కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. మధ్యాహ్నంకు 17 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా సాయింత్ర 6 గంటల తర్వాత మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

 

అయితే ఈరోజు నమోదైన కేసులలో అధిక శాతం ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ జమాత్‌ ప్రార్థనల్లో పాల్గొన్న వారే ఉన్నారు. అయితే ఆ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ సైతం ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే వాలింటర్లు ఉండటం కారణంగా ఏ గ్రామంలో ఎంతంది ప్రార్థనలకు వెళ్లారు అనేది సులభంగా కనిపెడుతున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: