ఇటీవల తెలంగాణ సీఎం కే‌సి‌ఆర్ కరోనా వైరస్ వల్ల చాలావరకు నష్టపోయిన ప్రజల కష్టాలను ప్రతి ఒక్కరూ పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కే‌సి‌ఆర్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రజాప్రతినిధుల జీతాలకు కోతలు విధించారు. ప్రభుత్వపరంగా ప్రజాప్రతినిధుల వేతనాల లో 75 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐ ఎస్ మరియు ఐ పి ఎస్ ఐ  ఐఎఫ్ ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోతం..అలాగే మిగతా ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీలో 50 శాతం కోత విధించడం జరిగింది. ఇంకా దిగువున ఉన్న నాలుగో తరగతి కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల విషయాలలో 10 శాతం కోత విధించారు. అదేవిధంగా రిటైర్డు ఉద్యోగులు అందరు పింఛన్ల లో 50 శాతం కోత విధించడం జరిగింది.

 

ఇదే తరుణంలో ప్రైవేటు ఉద్యోగుల కంపెనీల బేతాళ లో కూడా కొంత కోత పెట్టే వీలుందని తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. దీంతో నెలాఖరున జీతాలు అందుకునీ ఇప్పటికే ప్లాన్లు వేసుకున్న వాళ్ళ ప్లాన్లు మొత్తం అన్ని తలకిందులయ్యాయి. అయితే కెసిఆర్ ఐడియా మోడిని ఇంప్రెస్ చేసిందో ఏమో తెలియదు గానీ కేంద్రం కూడా ఇదే విధంగా జీతాల కటింగ్ కార్యక్రమం ఫాలో అవడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్.

 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్అమలులో కి ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్థులలో కోత విధించడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు రెడీ అవుతున్నట్లు సమాచారం. చాలామంది లాక్ డౌన్ వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఉపాధి కోల్పోవడంతో ప్రభుత్వపరంగా వారిని ఆదుకోవడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో పక్క దేశంలో ఉన్న ప్రముఖులు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు కూడా ప్రభుత్వాలకు భారీ స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: