ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల అందరూ బిక్కు బిక్కుమంటూ ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. దేశ ప్రధాని నుండి సామాన్యుడి వరకు అందరూ భయభ్రాంతులకు గురి అవుతూ ఎవరికి వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇండియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 21 రోజులపాటు దేశ ప్రజలు ఎవరు ఇల్లు దాటి బయటకు రాకూడదని లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇటువంటి కరోనా వైరస్ వల్ల అందరూ భయం భయంగా బతుకుతున్న టైంలో కొడాలి నాని బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి సైలెంట్ గా ఉండాల్సిన టైంలో రాజకీయాలు చేస్తూ చంద్రబాబు పై దారుణమైన విమర్శలు చేశారు.

 

ఇటీవల రేషన్ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే ముందే ఇస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు తన మీడియా సమావేశంలో కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. ప్రెస్ మీట్ లో కొడాలి నాని మాట్లాడుతూ...‘ఈ ప్రెస్‌ మీట్‌ చంద్రబాబుని విమర్శించడానికి కాదు..’ అంటూనే, ‘బొచ్చు పీకుడు.. సొల్లు వాగుడు’ అనే ఆణిముత్యాల్ని చంద్రబాబు మీద వదిలారు కొడాలి నాని. ఎల్లో మీడియా.. అంటూ ఆ రెండు మీడియా సంస్థల గురించీ కొడాలి నాని మరికొన్ని ఆణి ముత్యాలు పేల్చారు.

 

అదేవిధంగా గ్రామ వాలంటీర్ల విషయంలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని చంద్రబాబు పై మరియు ప్రభుత్వం పని చేస్తున్న తీరు పై వాడిన భాష సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు మంత్రి స్థానంలో ఉండి కొడాలి నాని ఆ విధంగా మాట్లాడకూడదు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదే టైమ్ లో కొంతమంది వైసీపీ మద్దతు దారులు సైలెంట్ గా ఉండాల్సిన ఈ టైంలో కొడాలి నాని ఏంటి ఈ గోల అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: