ప్రపంచ దేశ ప్రధానులు మరియు అధికారుల నుండి సామాన్యుల వరకు ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కరోనా వైరస్. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం భూమి మీద ఉన్న మనిషి జీవనాన్ని ప్రమాదకర స్థితిలోకి నెట్టేసింది. ఇటువంటి తరుణంలో మందులేని ఈ వైరస్ కి మందు కానుక్కోవడానికి గాను జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కంపెనీతో అమెరికా ప్రభుత్వం భారీ డీల్ కుదుర్చుకుంది. కాగా జాన్సన్ & జాన్సన్ ఈ వైరస్ కి మందు వ్యాక్సిన్ తయారు చేయటానికి ఇప్పటికే అనేక ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా మూడు వేల కోట్లకు పైగా నిధులను కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మానవులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షల ప్రారంభం కానున్నట్లు సంస్థ చెప్పుకొచ్చింది.

 

తాము ఇప్పటికే పరిక్షలు చేస్తున్న లీడ్ క్యాండిడేట్ ఉత్తమ ఫలితాలు ఇస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది మార్చి బహిరంగ మార్కెట్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సదుపాయాలను మానవ వనరులను దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలకే ప్రజలకు అందించడానికి మా వంతు కృషి చేస్తున్నట్లు జాన్సన్ & జాన్సన్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెక్స్ గోర్స్కీ పేర్కొన్నారు.

 

దీంతో ఈ వార్త ఇంటర్నేషనల్ స్థాయిలో రావటంతో చాలా యూరప్ దేశాలు సంతోషం వ్యక్తం చేశాయి. కచ్చితంగా జాన్సన్ & జాన్సన్ చేస్తున్న కృషి మంచి రిజల్ట్ ఇస్తే ఇదే నిజమైతే ప్రపంచమంతటా ప్రజలు డ్యాన్స్ చేస్తారని..సోషల్ మీడియాలో ఈ వార్త చదివిన చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరోపక్క ఈ ఏడాదిలోనే అమెరికా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందుగానే డోనాల్డ్ ట్రంప్ కలుగజేసుకుని త్వరగానే ఈ కరోనా వ్యాక్సిన్ ని తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: