ప్రపంచవ్యాప్తంగా వీరవిహారం చేస్తున్న కరోనా వైరస్ ను ఏ విధంగా కట్టడి చేయాలో తెలియక ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కొన్ని నెలలుగా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నా దానికి ఇప్పటి వరకు ఏ దేశం మందు కనిపెట్టలేకపోయింది. అసలు ఈ వైరస్ పీడ ఎప్పటికి సర్దుమణుగుతుందో ఎవరికీ అంతుపట్టడంలేదు. ఇక ఏపీలోనూ ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీని వ్యాప్తిని అరికట్టేందుకు జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, అధికారాలను, మంత్రులు, ఎమ్యెల్యేలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాడు. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రజల అవసరాలను యోగ క్షేమాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతవరకు బాగానే జగన్ పనితీరు ఉంది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు ఇద్దరూ విమర్శలు చేస్తున్నారు. 

 

IHG


ఏపీలో కరోనా వైరస్ రావడానికి కారణం జగన్ అన్నట్టుగా మాట్లాడుతుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం.. తాను సీఎంగా ఉంది ఉంటే కరోనా వచ్చి ఉండేది కాదని, నేను కంట్రోల్ చేసి ఉండేవాడినని అన్నట్టుగా మాట్లాడుతుండడంతో ఏపీ మంత్రి కొడాలి నాని  తమ రాజకీయ ప్రత్యర్థులకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. చైనాలో పుట్టి ప్రపంచమంతా విస్తరించిన కరోనా వైరస్‌కు ఇప్పటి దాకా ఎవ్వరూ వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారని, కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం కరోనా వ్యాక్సిన్‌ ప్రభావాన్ని తగ్గించి, దానిని భూస్థాపితం చేసి తానే వ్యాక్సిన్‌గా మారారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.ఇప్పడు నాని వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. 

 


జగన్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఎవరైనా విమర్శలు చేస్తే విరుచుకుపడడం లో నాని ముందు ఉంటారు. విమర్శలు చేసిన వారు ఏ స్థాయి వ్యక్తులు అయినా వెనక ముందు ఆలోచించకుండా నాని విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు  ట్రేండింగ్ లో ఉన్న కరోనా వైరస్ గురించి, దాని మందు గురించి మాట్లాడ్డం చర్చనీయాంశం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: