ఇప్పుడు దేశం మొత్తాన్ని తీవ్రమైన ఆందోళనలో పడేసిన ఢిల్లీలో జరిగిన మతపరమైన మీటింగ్ గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలంగాణలో మీటింగ్ కి హాజరైన ఆరుగురు చనిపోవడంతో బయటపడిన ఈ విషయం ఇప్పుడు దేశం లో హాట్ టాపిక్ గా మారింది. దిల్లీ లోని నిజాముద్దీన్ వద్ద ఒక మసీదులో జరిగిన ఈ మతపరమైన మీటింగ్ కి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 178 మంది వెళ్లి వచ్చినట్లు తెలిసింది. వారందరినీ ఆయా జిల్లాల నుండి వారి ఆధారాలను సేకరించి టెస్టులు చేసి క్వారంటైన్ కు పంపిస్తున్నారు.

 

ఇకపోతే మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా దేశాల నుండి దాదాపు 2000 మంది డెలిగేట్స్ ఈ మీటింగ్ కు హాజరు కావడానికి రాగా అందులో ఇంకా ఆందోళనకరమైన విషయం ఏంటంటే వారిలో 1400 మంది వద్ద ఇన్ని రోజులు ఈ దేశంలోనే నివసించారు. ఇప్పటికే ఈ మీటింగ్ కు సంబంధించిన మూడు వందల మందికి టెస్టులు జరగగా వారందరినీ ఢిల్లీలో ఐసోలేషన్ కోసం తరలించారు. అక్కడికి హాజరైనా అండమాన్ నికోబార్ దీవులకు చెందిన తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ అని తేలడం మరియు రెండు రాష్ట్రాల నుంచి కనీసం ఒక యాభై పాజిటివ్ కేసులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

ఇంకా ఇక్కడ ఆందోళన పరిచే విషయం ఏమిటంటే అక్కడికి వెళ్లి వచ్చిన వారు ఎన్ని రోజులు ఎవరెవరిని కలిశారు.... ఎక్కడెక్కడ తిరిగారు అనేది తెలుసుకోవడం మరియు తద్వారా సేకరించిన లిస్టు ని వీలైనంత త్వరగా ఐసోలేషన్ చేయడం చాలా కష్టతరమైన విషయం. అదీ కాకుండా 1400 మంది ఢిల్లీలోనే ఇన్ని రోజులు నివసించగా వారిలో ఎంతమంది పాజిటివ్ గా ఉన్నారు.. వారందరూ ఎంత మందికి ఈ వైరస్ అంటించారో తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కాబట్టి ప్రజలంతా మరికొద్ది రోజుల్లో పరిస్థితి మెరుగయ్యే వరకు ఇళ్లలోనే ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: