కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల పరిస్థితులు అన్ని తలకిందులు అయిపోయాయి. దేశాలకు దేశాలు లాక్ డౌన్ విధించడంతో ఇప్పుడు వారి ఆర్థిక పరిస్థితి పూర్తిస్థాయిలో దెబ్బతినింది. పేద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ క్షీణ దశకు చేరుకుంటున్నాయి. ఒక పక్క చూస్తే కరోనా నివారణకు కావలసిన నిధులు సమకూరడం లేదు మరొక పక్క చూస్తుంటే లాక్ డౌన్ కారణంగా దేశ ఆదాయం మొత్తం నిలిచిపోయింది.

 

పరిస్థితుల్లో బాగా గట్టిగా దెబ్బ తిన్న వారిలో ఇప్పుడే చదువు పూర్తిచేసుకుని విదేశాలకు వెళ్లే యువకులు ప్రప్రధమంగా చెప్పుకోవలసిన వారు. ఒకానొక సమయంలో ఇక్కడ బాగా చదివేవారు విదేశాల్లో బాగాపెద్ద ఉద్యోగం చేసి భారీగా డబ్బులు సంపాదించాలని ఎలాగోలాగా అమెరికా వెళ్లిపోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే అమెరికాలో చాలామంది భారతీయులు అలా స్థిరపడిపోయి ఉన్నారు. అమెరికాలో భారతీయ శాతం గమనిస్తే మొత్తం వారందరినీ ఒక చోట చేరిస్తే ఒక రాష్ట్రం మొత్తం నిండిపోతుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇతర దేశాల నుండి అక్కడికి వెళ్లిన వాళ్లని చూస్తుంటే వారి పరిస్థితి దయనీయంగా ఉంది.

 

ఆర్థికంగా మరియు అన్ని విధాల సైనికపరంగా దేశాన్ని అయిన ఢీ కొట్టగల సత్తా ఉన్న అమెరికా కరోనా వైరస్ వల్ల కాకా వికలమైపోయింది. ఆర్థిక పరంగా చూసుకుంటే అమెరికా ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేదని ఇంటర్నేషనల్ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. దీంతో ఇప్పుడు ప్రపంచ ప్రజల దృష్టిలో అమెరికా అంటేనే వద్దు బాబోయ్ అనే పరిస్థితికి వచ్చింది. దీంతో బాగా చదువుకొని అమెరికా కి వెళ్దామని రెడీ అవుతున్న వాళ్ళ ఆశలు కరోనా వైరస్ వల్ల ఆవిరైపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: