కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా విజృంభించిన విషయం తెలిసిందే. మంగళవారం ఒక్కరోజే 21 కేసులు నమోదయ్యి...మొత్తం కేసుల సంఖ్య 44 కు చేరుకుంది.  మంగళవారం పొద్దునే 17 కేసులు వస్తే, సాయంత్రం మరో 4 కేసులు నమోదయ్యాయి. అయితే మంగళవారం నమోదైన ఎక్కువ కేసులు ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చినవారివే.

 

అయితే ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ జమాత్ లో ఇస్తమా జరగ్గా, ఏపీ నుంచి 711 మంది ఆ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు తెలిసింది. ఇక ఆ ప్రార్థనలకు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. పైగా అక్కడ సామాజికదూరం పాటించక పోవడం వల్ల కరోనా సోకినట్లు తెలుస్తోంది. అయితే నిజాముద్దీన్‌ ప్రార్థనకు వెళ్లిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది.

 

ఇక ప్రభుత్వం పిలుపు మేరకు స్వచ్చందంగా  వచ్చి కరోనా టెస్టులు చేయించుకుంటే, మరికొందరు తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో జగన్ ప్రభుత్వం కొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది.

 

మొండికేసిన కరోనా పెషేంట్‌ను హాస్పటల్స్ కు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కరోనా లక్షణాలు ఉన్న రోగిని ఎలా తీసుకురావాలి, వారికి ఏ విధంగా హ్యాండిల్ చేయాలనే దానిపై మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అలాగే ఢిల్లీ నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, లేదంటే బలవంతంగా  పట్టుకునైనా టెస్టులు చేసేందుకు సిద్ధమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

 

ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని కూడా సిద్ధం చేశామని, కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చినవారు సహకరించాలని చెబుతున్నారు. వారు సహకరించకపోతే రాష్ట్రంలో మరిన్ని కరోనా కేసులు పెరుగుతాయని, కాబట్టి ముందు జాగ్రత్తగా వారిని అదుపులోకి తీసుకుని కరోనా టెస్టులు చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా, ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో ఒక 85 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వారిని త్వరగా కనిపెట్టి, కరోనా టెస్టులు నిర్వహిస్తామని అంటున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: