ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విల‌య తాండవం చేస్తోంది. ఇప్ప‌ట ఇవ‌రకు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డిన వారి సంఖ్య నిమిషం నిమిషానికి పెరుగుతూ 9 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతోంది. ఇక క‌రోనా మృతులు 42 వేల‌కు చేరువ అయ్యారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ఇంత విజృంభిస్తున్నా రెండు దేశాల్లో మాత్రం మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆ రెండు దేశాలే ఇట‌లీ, అమెరికా. ఇట‌లీలో ఇప్ప‌టి వ‌ర‌కు 12, 427 మంది క‌రోనా సోకి చ‌నిపోయారు. ఇక ఇట‌లీల గ‌త నాలుగు రోజులుగా చూస్తుంటే స‌గ‌టున రోజుకు వెయ్యి మంది చ‌నిపోతున్నారు.

 

అక్క‌డ శ‌వ‌పేటిక‌లు కూడా దొర‌క‌ని పరిస్థితి. దీంతో శ‌వాల‌ను మూకుమ్మ‌డిగా ద‌హ‌నాలు చేసేస్తున్నారు. లేకుంటే గొయ్యి తీసి పూడ్చ‌తోన్న ప‌రిస్థితి. ఇక అటు అమెరికాలో మంగ‌ళ‌వారం ఒక్క రోజే 865 మంది చ‌నిపోయారు. అమెరికాలో మ‌ర‌ణాల సంఖ్య 4 వేల‌కు చేరుకుంది. ఇక్క‌డ రోజు రోజుకు వేల సంఖ్య‌లో బాధితుల సంఖ్య పెర‌గ‌డంతో పాటు మృతులు కూడా ఎక్కువగానే ఉండ‌డంతో అటు వైద్యం అంద‌డం లేదు స‌రిక‌దా.. చివ‌ర‌కు చ‌నిపోయిన వాళ్ల‌కు ఇక్క‌డ కూడా స‌రైన ద‌హ‌న సంస్కారాలు జ‌ర‌గ‌డం లేదంటున్నారు.

 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి కోలుకున్న వారి సంఖ్య 1.77 ల‌క్ష‌లు ఉంది. ఇక ఇటు తెలంగాణ‌లో ఈ కేసులు 97 ఉంటే... ఏపీలోనూ క‌రోనా బుధ‌వారం ఒక్క‌సారిగా రెచ్చిపోయింది. రాష్ట్రంలో ఒక్కసారిగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికులు కలకలం రేపారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి నుంచే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయనుకుంటే,  ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. మార్చి 30వ తేదీ సోమవారం రాత్రి వరకు 23 పాజిటివ్‌ కేసులతో ఉన్న రాష్ట్రం మంగ‌ళ‌వారానికి 44కు చేరుకుంటే బుధ‌వారం ఉద‌యానికి ఏకంగా 58 కు చేరుకుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: