కరోనా మహమ్మారి ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి అగ్రరాజ్యాన్ని సైతం చిగురుటాకులా వణికిస్తోంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ బారిన పడి 8 లక్షలమందికిపైగా ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో 39వేలమంది ప్రాణాలు కోల్పోయారు..

 

ఇంకా అలాంటి ఈ వైరస్ కారణంగా అమెరికా అల్లాడిపోతోంది. కరోనా మహమ్మారిని ఎదర్కోవడానికి ప్రపపంచమంత నానా తిప్పలు పడుతున్న ఈ సమయంలో నార్త్ కొరియా వారి సంపదలో 60 శాతం వరకూ మిలటరీ అవసరాలకు ఖర్చుచేయడాన్ని తప్పుపడుతున్నాయి. 

 

ఇంకా ఈ సమయంలో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఉత్తర కొరియాపై అక్కసు వెళ్లగక్కారు. అణ్వాయుధ పరీక్షలు నిలిపివేసేలా నార్త్ కొరియాపై ఇతర దేశాలు ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపుకు కొరియా వర్గాలు ఘాటుగా సమాధానం ఇచ్చాయి. ఆ సమాధానం చూస్తే ఎవరైన సరే షాక్ అవ్వలేసిందే. అలా ఉంది ఆ సమాధానం. 

 

వారికీ ఇప్పుడు అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాల కంటే కూడా, అగ్రరాజ్యానికి నిజంగా భయం అనేది ఎలా ఉంటుందో చూపించాలి అనిపిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మైక్ పాంపియో హద్దు మీరి మాట్లాడారని, ట్రంప్ ఆదేశాలు కూడా పట్టించుకోలేదని ఆరోపించింది. కరోనా వైరస్ సమయంలో నార్త్ కొరియా మాటలు సంచలనం అవుతున్నాయి. ఇకపోతే కరోనా మహమ్మారి బారిన పడి అమెరికాలో మూడు వేలమందికిపైగా మృతి చెందారు. లక్షమందికిపైగా కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిపాలయ్యారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: