కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా ఆలోచించడం మొదలుపెడుతుంది. కరోనా వైరస్ ని ఏ విధంగా కట్టడి చెయ్యాలని చూసినా సరే దాన్ని కట్టడి చేయడం అనేది సాధ్యం కావడం లేదు. ప్రజల నుంచి సహకారం ఉండాల్సిన తరుణంలో ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. కరోనా కట్టడి చేయడం అనేది ఇప్పుడు సవాల్. 

 

దీనితో ఇప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే, ఆస్పత్రులకు రోగులను తీసుకురాకుండా ఉండటమే మంచిది అనే అంచనాకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వస్తుంది. దీనితోనే ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ కి చికిత్స చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి, వాళ్ళ నుంచి బయటి వారికి వ్యాపించకుండా ఉండటానికి, 

 

ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటకు రానీయకుండా అనుమానం ఉన్న వాళ్ళను ఇప్పుడు బయటకు తీసుకురాకుండా... వారి నుంచి నమూనాలను ఇళ్ళ నుంచే సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అక్కడి నుంచే వాళ్లకు ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందించడం ద్వారా ఏ ఇబ్బంది ఉండదు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 1500 కి చేరువలో ఉన్నాయి. దీనితో కేంద్రం అప్రమత్తమవుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: