కరోనా వైరస్ విషయంలో ప్రజలు ఇంకా భయపడటం లేదా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. బయటకు రాకుండా ఉండాలని ఎన్ని విధాలుగా ప్రజలకు ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నా వాళ్ళు మాత్రం వినడం లేదు. కరోనా ఇప్పుడు దేశంలో మూడో దశకు చేరుకుంటుంది. ఒక్కసారి అది మూడో దశకు చేరుకుంటే మాత్రం దాన్ని కట్టడి చేయడం అనేది ప్రభుత్వాలకు సాధ్యం అయ్యే పని కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

 

 

ఉన్నపళం గా ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1500 కి దగ్గరలో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆ సంఖ్య దాటినా పెద్దగా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఇక మరణాలు కూడా 50 కి చేరువలో ఉన్నాయి. కాబట్టి ప్రజలు మాట వినకపోతే మాత్రం ఇప్పుడు కట్టడి చేయడం అనేది దేవుడు దిగి వచ్చినా సరే సాధ్యం అయ్యే పని కాదు. 

 

 

కరోనా ఇప్పుడు ఏపీ, తెలంగాణా, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. దీనితో ఇప్పుడు ప్రజల్లో భయం రాకుండా ఉండి ఇష్టం వచ్చినట్టు బయట తిరిగితే మాత్రం పరిస్థితులు అంచనా వేయలేని విధంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మాట వినకపోతే ఎవరూ కూడా చేసేది ఏమీ ఉండదు అంటున్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎవరూ కూడా అశ్రద్ధ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: