సోషల్ మీడియా ప్రతీ విషయంలోనూ చాలా వరకు అతి చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి చూపిస్తూ సైకో ఆనందం పొందుతూ ఉంటారు సోషల్ మీడియా వాడే జనాలు. వాళ్లకు అది ఒక సరదా అయిపోయింది ఈ రోజుల్లో. ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఎవరూ కూడా వినే పరిస్థితి ఉండటం లేదు. సోషల్ మీడియా ఇప్పుడు కరోనా మీద పడింది. సోషల్ మీడియాలో కరోనా గురించి పండగ చేసుకుంటున్నారు జనాలు. 

 

 

ఇప్పుడు ప్రజలను అన్ని విధాలుగా సోషల్ మీడియా కరోనా విషయంలో భయపెడుతుంది. చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటుంది. ఢిల్లీ ఘటన విషయ౦లో కొంత వాస్తవాలను ప్రచారం చేస్తూనే కొంత తప్పుడు ప్రచారం చేస్తుంది. ఢిల్లీ ఘటనలో వెళ్లి వచ్చిన వాళ్ళు మా ఇంటి దగ్గర ఉన్నారని కొందరు, కాదు మా ఇంటి దగ్గర ఉన్నారని మరికొందరు ఇప్పుడు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 

 

 

విశాఖలో పలానా ప్రాంతంలో వాళ్ళు బస చేసారని కొందరు, ఏలూరులో పలానా చోట తిరిగారని అధికారులు గుర్తించారు అని మరికొందరు... ఎవరికి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. జరిగింది కొద్దిగా అయితే చేసే ప్రచారం మాత్రం ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉంటుంది. దీనితో జనాలు మరింత భయపడుతున్నారు. చాలా మందికి ఎం చెయ్యాలో అర్ధం కాని విధంగా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ ప్రచారం ఇప్పుడు ఆందోళనకరంగా మారుతూ ఉంటుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: