స్మార్ట్ ఫోన్ నుంచి కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అమెరికాకు చెందిన ఒక ఆరోగ్య సంస్థ దీనిపై సర్వే చేసి ఈ విషయాన్ని బయటపెట్టింది. స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం. దీన్ని మన౦ ప్రతీ సందర్భంలోనూ వాడుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా సరే అది మనకు తోడు ఉండాల్సిందే. ఈ విషయం అందరికి తెలుసు. చిన్న అవసరానికి కూడా స్మార్ట్ ఫోన్ కావాలి. 

 

ప్రతీ ఒక్కరికి ఇదే పనిగా మారిపోయింది. ఇప్పుడు ఇదే మన ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ నుంచి కరోనా వైరస్ వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. స్మార్ట్ ఫోన్ గ్లాస్ మీద కరోనా వైరస్ ఏకంగా 96 గంటల పాటు బ్రతికి ఉంటుంది అంటున్నారు. కరోనా వైరస్ స్మార్ట్ ఫోన్ మీద శుభ్రం చేసినా అంత త్వరగా పోయే అవకాశం ఉండదు అంటున్నారు. 

 

మనం చేతిని శుభ్రం చేసుకున్నా సరే ఫోన్ మీద ఉంటే చేసేది ఏమీ ఉండదు అంటున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ ని కూడా శానితైజ్ చేసుకోవడం చాలా మంచిది అని పలువురు సూచిస్తున్నారు. దాని మీద ప్రతీ ప్రాంతంలోనూ కరోనా వైరస్ బ్రతికి ఉంటుంది కాబట్టి శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటే ఏ గొడవ ఉండదు అని ప్రజలకు ఇప్పుడు సూచిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: