లాక్ డౌన్ ని మరింతగా పొడిగించాల్సిన అవసరం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దేశంలో లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనపడుతున్నాయని పలువురు అంటున్నారు. కరోనా వైరస్ తీవ్రత ఇప్పుడు పెరుగుతుంది. ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్యే ఇప్పుడు ఎక్కువగా ఉంది. వారి నుంచే కేసులు విస్తరిస్తున్నాయి కాబట్టి వారి నుంచి వేరే వారికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 

 

వాళ్ళ నుంచి బయటపడటానికి మరో రెండు వారాలు సమయం ఉంటుంది కాబట్టి, ఇంకా లాక్ డౌన్ ని పొడిగించి ప్రజా రవాణా పూర్తిగా ఆపెయకపోతే మాత్రం ఇంకా విస్తరించి ఆ తర్వాత చెయ్యాల్సి వచ్చేది ఏమీ ఉండదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకా దేశంలో లాక్ డౌన్ ని కనీసం 10 రోజులకు పైగా పెంచితే లాభం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. 

 

ఇప్పుడు ప్రజలు బయటకు రాకుండా పట్టు దొరికింది కాబట్టి దీన్ని ఏ మాత్రం సడలించినా సరే తీవ్ర ప్రభావం ఉంటుంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి లాక్ డౌన్ ని మరిన్ని రోజులు పెంచితే కట్టడి చేయడం సాధ్యమవుతుంది అని అభిప్రాయపడుతున్నారు. దీన్ని మించిన మరో మార్గం దేశం ముందు లేదు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: