కరోనా ప్రభావంత రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గింది. అందుకే ముందు జాగ్రత్తగా రాష్ట్రాలు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అందులో భాగంగా తెలంగాణ సీఎం కేసఆర్ ఉద్యోగుల జీతాల్లో కోత వేశారు. ప్రజాప్రతినిధులకూ ముప్పావువంతు జీతం కోతేశారు.. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అంతే కాదు.. కేసీఆర్ కంటే ఓ అడుగు ముందుకేసి అసలు మార్చి నెల జీతాలనే వాయిదా వేశారు. అందువల్ల మార్చి నెల జీతాలు సీఎంతో సహా ఏపీ ప్రజాప్రతినిధులెవరకీ రావన్నమాట. 

 

లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహా అందరు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ల ను కొంత మేర వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర నిధుల వినియోగానికి గానూ ఈ నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా పడిపోయిన కారణంగా పరిమితంగా ఉన్న ఆర్ధిక వనరుల వినియోగానికి ఈ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

 


కరోనా వైరస్ నియంత్రణా చర్యలతో పాటు లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల్లో కొంత మొత్తాన్ని వాయిదా వేసేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.  ముఖ్యమంత్రి, మంత్రులు , శాసనసభ్యులు, మండలి సభ్యులు, చైర్ పర్సన్లు ఇతర ప్రజాప్రతినిధులందరీ  నెలసరి వేతనం, గౌరవ వేతనాలను వంద శాతం మేర చెల్లింపు వాయిదా వేస్తూ ప్రభుత్వ ఆదేశాలు  వెలువడ్డాయి. ఐఎఎస్,ఐపీఎస్ అధికారులు సహా అఖిలభారత సర్వీసు అధికారుల వేతనాలను 60 శాతం మేర తదుపరి చెల్లింపునకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వర్క్ ఛార్జ్ డ్ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు 50 శాతం మేర వాయిదాకు ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: