క‌రోనా.. ఇప్పుడు ఎక్క‌డ చూసినే ఇదే మాట వినిపిస్తోంది. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ మొత్తం వ్యాప్తి.. ప్ర‌జ‌ల‌ను కంటి మీద క‌నుకు లేకుండా చేస్తుంది. ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 8,56,579 కరోనా కేసులో న‌మోదు కాగా,  42,089 మంది మృతి చెందారు. ఇక ఈ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు దృష్టి పెట్టాయి. ఈ క్ర‌మంలోనే వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు, సూచనలు ఎప్ప‌టిక‌ప్పుడు ఇస్తూనే ఉన్నాయి. 

 

ఇదిలా ఉంటే.. క‌రోనా పేషంట్ల కోసం త‌న పెళ్లినే వాయిదా వేసుకుని.. అంద‌రికీ స్పూర్తిగా నిలిచింది ఓ మ‌హిళ డాక్ట‌ర్‌. కేరళకు చెందిన 23 ఏళ్ల షిఫా ఆ రాష్ట్రంలోని పరియారం మెడికల్‌ కాలేజీలో హౌస్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె వివాహం దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త అనుస్‌ మహమ్మద్‌తో మార్చి 29న జ‌ర‌గాల్సి ఉంది. కాని, క‌రోనా కబ‌ళిస్తున్న నేప‌థ్యంలో ఆమె కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేరళ రాష్ట్రం కరోనాపై యుద్ధం చేస్తున్న సమయంలో వ్యక్తిగత సంబరాల కంటే సామాజిక బాధ్యతకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ వివాహాన్ని వాయిదా వేయించుకుంది. ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేస్తున్న ఈ క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే స‌మ‌యంలో పెళ్లి కంటే డాక్టర్‌గా నిర్వర్తించాల్సిన బాధ్యత విలువైందిగా భావించింది షిఫా. 

 

ఈ క్ర‌మంలోనే ఇటు త‌ల్లిదండ్రుల‌ను.. అటు వ‌రుడు త‌ర‌పున కుటుంబాన్ని ఒప్పింద‌ది. అయితే ఈ విషయంపై మీడియాతో మాట్లాడటానికి షిఫా అంత ఆసక్తి చూపలేదు. నేను చేసింది అంత గొప్ప విషయం కాదు. సమాజం పట్ల నా బాధ్యతను మాత్రమే నిర్వర్తించాను అని వినమ్రంగా షిఫా వ్యాఖ్యానించ‌డం విశేషం. ఇక వివాహం వాయిదా విషయాన్ని షిఫా తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించినప్పుడు వారు కూడా అడ్డుచెప్పకుండా తమ కుమార్తె తీసుకున్న నిర్ణయానికి సంతోషంగా సమ్మతి తెలిపారు. ఈ విష‌యం తెలుసుకున్న అంద‌రూ ఆమెను శ‌భాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: