ఢిల్లీలో జ‌రిగిన జ‌మాత్ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న వారు దేశ వ్యాప్తంగా ఉండ‌టంతో ఇప్పుడు భార‌త ప్ర‌జ‌ల గుండెల్లో వ‌ణుకు పుట్టిస్తోంది.  ఈ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న దాదాపు 10మంది ఇప్ప‌టి వ‌ర‌కు చ‌నిపోగా, ఇందులో తెలంగాణ‌కు చెందిన వారే ఐదుగురు ఉండటం గ‌మ‌నార్హం.  ఐదుగురు కూడా ఒకేరోజు మరణించిన విష‌యం తెలిసిందే. ఇద‌లా ఉండ‌గా పొరుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి పెద్ద‌సంఖ్య‌లో ముస్లింలు ఆధ్యాత్మిక ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైన‌ట్లుగా పోలీసులు గుర్తించారు. దాదాపు వెయ్యిమంది ముస్లింలు ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ట్లుగా భావిస్తున్న అధికారులు ఇప్ప‌టికే కొంత‌మందిని గుర్తించారు. తెలంగాణ‌లోనూ అదే ప‌రిస్థితి. ప్ర‌తీ జిల్లాను  ప్ర‌త్యేక బృందాలు జ‌ల్లెడ ప‌డుతున్నాయ‌.

 

 న‌యాన్నో..భ‌యాన్నో మొత్తానికి వివ‌రాలు క‌నుక్కునేప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.  తెలంగాణ విష‌యానికి వ‌చ్చేసరికి ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో అనేక మంది హైద‌రాబాద్ న‌గ‌రం, దాని చుట్టుప‌క్క‌ల నివాసం ఉంటున్న‌వారే 60శాతం వ‌ర‌కు ఉన్న‌ట్లు అధికారులు అంచ‌నాకు వ‌చ్చారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం మధ్యాహ్నానికి పోలీసు, ఆరోగ్య శాఖలు ఒక నిర్ధారణకు వచ్చాయి. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రార్థనలకు హాజరై వస్తున్న 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌కు తరలించిన‌ట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక స‌ద‌స్సుకు హాజ‌రైన వారిలో అత్య‌ధికులు రైలు, విమాన సర్వీసుల ద్వారానే వెళ్లి వ‌చ్చిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు. 

 

ముఖ్యంగా రైళ్ల‌లో తిరిగి వ‌చ్చిన వారి ఆచూకి క‌నుగొన‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. తిరుగు ప్రయాణంలో వీరి ద్వారా ఎంతమందికి సంక్రమించి ఉంటుందన్నది ఇప్పుడు జ‌నాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.  జీహెచ్‌ఎంసీ పరిధి, మిగతా జిల్లాల నుంచి 1,030 మంది ప్రార్థనలకు వెళ్లినట్టు గుర్తించిన వారితోపాటు వారి కుటుంబసభ్యులను పోలీసులు, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారంద‌రికి ఓపీ విభాగంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి 250 మందికి వైద్యపరీక్షలు నిర్వ‌హించ‌గా, ఇందులో  117 మందికి కరోనా ల‌క్ష‌ణాలున్న‌ట్లు వైద్యులు గుర్తించి వారిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. మిగిలిన వారి వివరాలు సేకరించి హోం క్వారన్‌టైన్‌కు ఆదేశించారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: