పరిస్థితి అదుపులోకి వస్తుంది అనుకుంటే రోజు రోజుకి ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తోంది. ఎంత అప్రమత్తతో వ్యవహరిస్తున్నా, ప్రజల నిర్లక్ష్యం కారణంగా దీనికి వ్యాప్తి పెరుగుతూనే వస్తోంది. కరోనా వైరస్ విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండవద్దు అంటూ చెబుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడంలేదు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే కరోనా ఏపీలో కంట్రోల్ లో ఉంది అని అంతా అనుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులో ఏపీలో ఆందోళనకర రీతిలో పెరుగుతున్న పరిస్థితుల్లో ఏపీలో ప్రభుత్వం టెస్టుల సంఖ్యను ఒక్క సారిగా పెంచినా, పాజిటివ్ కేసులు అంతే వేగంగా బయటపడుతున్నాయి. ఇరవై నాలుగు గంటల్లో ఏపీ సర్కార్ గత కొద్ది రోజులుగా చేయని విధంగా 250 మందికి పైగా కరోనా అనుమానిత పరీక్షలు నిర్వహించగా వాటిలో 34 పాజిటివ్‌గా తేలాయి. 


ప్రస్తుత లెక్కల ప్రకారం, ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 58. మంగళవారం ఉదయానికి ఈ సంఖ్య 24 వరకే ఉండగా ఒక్క రోజులోనే 34 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని టెస్టులు చేయడంతో ఇన్ని పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా కరోనా అనుమానితుల టెస్టులు నిర్వహించగా వారికి వైరస్ సోకే యావరేజ్ నాలుగైదు శాతంలోపు ఉంటుంది. ఇలా ఉంటేనే చాలా తీవ్రంగా ఉన్నట్లు. కానీ మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలో 30 మందికి టెస్టులు చేస్తే ఏకంగా 14 మందికి పాజిటివ్‌గా తేలింది. కేవలం పది మందికి మాత్రమే నెగెటివ్‌ వచ్చింది. మరో ఆరుగురి రిపోర్టులు రావాల్సి ఉంది. యాభై శాతానికిపైగా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇది అసాధారణం. ఇప్పటి వరకు కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనుమానం ఉన్నవారికే టెస్టులు చేసేవారు. 


కానీ ఢిల్లీ మాత ప్రార్ధనల నిమిత్తం వెళ్లి వచ్చిన వారందరికీ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో మత సమావేశాల్లో పాల్గొని తిరిగి వచ్చిన వ్యక్తుల్లో ఆరుగురు ఒకే  రోజే ఆరుగురు చనిపోయారు. ఏపీలోనూ.. ఇలా సమావేశాలకు వెళ్లి వచ్చిన వాళ్లు వెయ్యి మంది వరకూ ఉన్నారు. దీంతో అలెర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం వారందరి లెక్కలు బయటకి తీసి వారందరిని క్వారంటైన్ కు పంపిస్తోంది. కరోనా లక్షణాలు అనేవి రెండు,మూడు వారాల వరకు బయటపడవు. కరోనా లక్షణాలు లేవని వారు స్వేచ్చగా తిరుగుతూ, ఇతరులకు వైరస్ వ్యాపింపచేస్తూ ఉంటారు.అందుకే అనుమానం ఉన్నవారితో పాటు కొత్తగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారందరిని క్వారంతం కు తరలించి టెస్టులు చేయడం, ప్రస్తుతం వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు కాబట్టి ఏ ఇంట్లో వ్యక్తుల మీద అనుమానం ఉన్నా వెంటనే వారందరికీ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక ప్రజల్లోనూ ఈ విషయంపై మరింత అవగాహన కల్పించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: