చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి కరోనా మహమ్మారి ప్రపంచం లో 200 దేశాల్లో వ్యాపించింది .  ప్రతిరోజూ ఎన్ని మరణ వార్తలు వినాల్సి వస్తుందో అన్న భయం వేస్తుంది.  ఈ దిక్కుమాలిన కరోనా ఎఫెక్ట్ చైనా తర్వాత అంత భయంకరంగా ప్రభావం చూపుతున్న దేశాలు..  ఇటలీ, స్పెయిన్, అమెరికాల  తరువాత ఫ్రాన్స్‌లో కరోనాతో  మరణించిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్క రోజే ఫ్రాన్సులో గరిష్టంగా 499 మంది మరణించారు. అయితే ఫ్రాన్స్‌లో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.

 

తాజాగా మృతి చెందిన వారితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 3,523కి చేరుకోగా, 22,757 మంది వైరస్ బారినపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే, 5,565 మందిపై నిఘా కొనసాగుతున్నట్టు ఆరోగ్య విభాగపు అధికారి జెరోమ్ సలోమన్ తెలిపారు.  ఇటలీ, ఫ్రాన్స్ మంచి పర్యాటక కేంద్రాలు కావడం అక్కడ వివిధ దేశాల నుచి విపరీతంగా జనాలు వెళ్లడం మూలంగా ఈ కరోనా వ్యాప్తి జరిగినట్లు తెలుస్తుంది.  అయితే కరోనా గురించి మొదట్లో జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా మరో కారణం అయి ఉండొచ్చని అంటున్నారు.  ఏది ఏమైనా చైనా తర్వాత ఇటలీ.. దాని తర్వాత ఫ్రాన్స్ లో దీని ప్రభావం తీవ్రంగా ఉందని అంటున్నారు.

 

ఈ దిక్కుమాలిన కరోనా తగ్గుతుంది కదా అనుకుంటే... ప్రపంచ దేశాలు సరైన కట్టడి చర్యలు తీసుకోకపోవడంతో... మరింత పెరుగుతోంది. నాలుగైదు రోజులుగా... రోజూ 60వేల కేసులు కొత్తగా నమోదవుతుంటే... మంగళవారం మాత్రం 71,841 కేసులు నమోదయ్యాయి.  ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 856579 మంది కరోనా కేసులున్నాయి. వీటిలో 177039 కేసులు రికవరీ అయ్యాయి. ఇంకా 637451 మంది కరోనాతో బాధపడుతున్నారు. వీరిలో 605161 కేసుల్లో వ్యాధి తీవ్రత అంతంతమాత్రమే. 32290 కేసుల్లో మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 42089కి చేరింది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: