ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిదిన్న‌ర‌ లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఈ కేసులు ఇప్ప‌టికే 9 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక క‌రోనా భారిన ప‌డి ఇప్ప‌టికే 43 వేల మంది మ‌ర‌ణించారు. ఈ సంఖ్య నిమిషం నిమిషానికి పెరుగుతోంది. అస‌లు ప్ర‌పంచంలో ఏ మూల‌కు అయినా కూడా క‌రోనా వైర‌స్ పాకేస్తోంది. ఇప్ప‌టికే అన్ని దేశాలు లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా 202 దేశాల‌కు క‌రోనా పాకేసింది.  అయినప్పటికీ ఈ వైరస్‌ సోకని మారుమూల ప్రాంతాలు కూడా ఉన్నాయి. 

 

నిజంగా ఇది వింటుంటే చాలా ఆశ్చ‌ర్యంగానే ఉంది. అలాంటి దేశాల్లో పలావు ద్వీపం కూడా ఒకటి. ఇది ఉత్తర పసిఫిక్‌లో ఉంది. ఇక్కడి జనాభా సుమారు 18,000. అయితే ఈ ద్వీపంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాలేదంటే చాలా ఆశ్చ‌ర్య‌మే. ఎంతో పెద్ద‌ది అయిన పసిఫిక్‌ మహాసముద్రంలో ఒక్క బిందువుగా కనిపించే ఈ ద్వీపానికి  సమీప పొరుగు ప్రాంతాలు కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే  ఉన్నాయి. 

 

అయితే ఈ ద్వీపం ముందు నుంచి వైరస్‌కు వ్యతిరేకంగా బఫర్‌గా పనిచేసింది.  టోంగా, సోలమన్‌ దీవులు, మార్షల్‌ దీవులు, మైక్రోనేషియాతో సహా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు తమకు కరోనా విస్తరించకుండా విధించుకున్న కఠినమైన ప్రయాణ ఆంక్షలు ఇందుకు సహాయపడ్డాయి. ప్ర‌పంచం అంతా క‌రోనాతో విల‌విల్లాడుతున్నా ఈ ద్వీప వాసులు మాత్రం క‌రోనా సోకకుండా త‌మ లైఫ్‌ను హ్యాపీగా మామూలుగానే అనుభ‌విస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: