లాక్‌డౌన్ నేప‌థ్యంలో రాష్ట్ర ఖ‌జానాకు నిధుల రాక పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఉద్యోగుల జీతాల చెల్లింపున‌కు కూడా క‌ట‌క‌టే ఎదుర‌వుతున్న ప‌రిస్థితి. ఉన్న కొన్ని నిధుల‌ను అత్య‌వ‌సర వైద్య సేవ‌లు, నిత్యావ‌స‌రాల పంపిణీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయిస్తూ వ‌స్తోంది. అయితే నిధుల వినియోగంలో పొదుపు మంత్రం పాటిస్తూనే..చెల్లింపుల్లోనూ కోత‌లు విధించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఉద్యోగుల్లోనూ 50శాత కోత విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.  ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు కోత పెట్టాలని సీఎం  కేసీఆర్ అధికారుల‌కు సూచించారు.

 

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నంత కాలం ఈ కోత జీతాల కోత కొన‌సాగుతుంద‌ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ స్పష్టతనిచ్చారు. మంగళవారం జిల్లా ట్రెజరీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. కేవ‌లం ప‌ది రోజుల లాక్‌డౌన్‌కే నెల‌రోజుల వేత‌నంలో 50శాతం మేర కోత విధించ‌డంపై ఉద్యోగ సంఘాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో  రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి రొనాల్డ్‌ రోస్ వ్యాఖ్య‌లపై ప్రాధాన్యం సంత‌రించుకుంద‌నే చెప్పాలి. ఇదిలా ఉండ‌గా కరోనా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలకు సాయంగా ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. 

 

ఈ మేరకు ఉద్యోగుల వేతనాల నుంచి ఒకరోజు మూలవేతనాన్ని మినహాయించుకోవాల్సి ఉండగా, ఇంతవరకు ఉత్తర్వులు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఏప్రిల్‌లో చెల్లించే మార్చి నెల జీతంలో ఒకరోజు మూల వేతనాన్ని కోతపెట్టాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ ట్రెజరీలకు తెలిపింది. వేతనాల్లో కోతను ఎత్తేసిన తర్వాత ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వం మినహాయించుకోనుంద‌ని స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ఇదిలా ఉండ‌గా కరోనా వైరస్‌ నియంత్రణకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న వైద్య, పోలీస్, పారిశుధ్య ఉద్యోగులు, సిబ్బందికి వేతనాల్లో కోతల్లేకుండా పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మార్చినెల జీతం అందేందుకు మ‌రో రెడు రోజులు ఆగాల్సిందే.  ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో సెలవులు ఉండ‌టంతో 3వ తేదీన జీతాల చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాల‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ.. అన్ని జిల్లాల ట్రెజరీలను ఆదేశించింది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: